చేరే వారు, చేరుతున్న వారు, చేరబోయే వారు ఇలా వైసీపీలో ఎక్కడలేని సందడి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి నాయకులు పెద్ద ఎత్తున తొంగి చూస్తున్నారు.ఈ పరిణామాలు అధికార పార్టీకి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. టీడీపీ మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవహారం చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఆయన బలమైన నాయకుడు, ఒక రకంగా చెప్పుకుంటూ ప్రస్తుతం చంద్రబాబుకు ఆయన కుడి భుజంగా పనిచేస్తున్నారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు అధికార పార్టీ దెబ్బకు జైలు పాలయ్యాడు. ఆయన తరువాత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలు పాలయ్యాడు. కొత్తగా విశాఖ జిల్లా కీలక నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పైన నిర్భయ కేసు నమోదైంది. ఈ వ్యవహారాల్లో వారి స్వయంకృపరాధం ఎక్కువగా కనిపిస్తోంది. 

 

IHG

 

ఈ విషయాన్ని పక్కనపెడితే, ఇలా వరుసగా వైసీపీ ప్రభుత్వం టిడిపిని నామరూపాల్లేకుండా చేసేందుకు వ్యవహరిస్తున్న తీరుతో నాయకుల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో గత టీడీపీ ప్రభుత్వంలో అన్నీ తానే వ్యవహరించి చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన మాజీ మంత్రి నారాయణ పేరు తెరమీదకు వస్తోంది. ఆయన వైసీపీ లోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఆయన్ను చేర్చుకునేందుకు వైసీపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే వార్తల నేపథ్యంలో అనేక విషయాలు తెర మీదకు వస్తున్నాయి. టిడిపిలోని ఇతర నాయకులను ఎవరిని చేర్చుకున్నా, వైసీపీకి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ నారాయణ విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వం లో నారాయణ వ్యవహరించిన తీరుపై వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ముఖ్యంగా అమరావతి భూముల వ్యవహారంలో నారాయణ అవినీతికి  పాల్పడ్డారని, పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. అంతేకాకుండా అమరావతి భూముల వ్యవహారంపై విచారణ చేస్తోంది. అలాగే నారాయణ కు సంబంధించిన విద్యా సంస్థలు పెద్ద ఎత్తున నిబంధనలు అతిక్రమించి ఎంతో మంది పిల్లల ఆత్మహత్యలకు కారణమైందని వైసీపీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తోంది. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ కి సంబంధించిన విద్యాసంస్థలు చాలాచోట్ల సీజ్ చేయించారు. అటువంటి వ్యక్తిని ఇప్పుడు వైసీపీలో చేర్చుకుని తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బ తీయాలన్నది వైసీపీ ప్లాన్. 


కాకపోతే విలువలు విశ్వసనీయత అంటూ చెప్పుకుంటూ వస్తున్న వైసిపి ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే అమరావతి భూ వ్యవహారాలపైన చేస్తున్న దర్యాప్తు లో నారాయణ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని రకాలుగా చూసుకున్నా, నారాయణ చేర్చుకోవడం వైసీపీకి పెద్ద తలనొప్పి వ్యవహారమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: