రాష్ట్ర రవాణా శాఖ మొబైల్‌ యాప్‌ ‘ఎం-వాలెట్‌'ను 2016, ఫిబ్రవరి 23 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ ద్వారా సంబంధిత పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకొని సోదాల సమయంలో పోలీసులకు చూపించే వెసులుబాటు కల్పిస్తుందన్నారు. ఇప్పుడు దీనిని వినియోగిస్తున్న వాహనదారుల సంఖ్య రాష్ట్రంలో 50 లక్షలు దాటిందన్నారు. 

 

 

రెండేళ్లలో ప్రభుత్వం రోడ్డు భద్రతా అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో మార్పులు చేసింది. ముఖ్యంగా మద్యం తాగి డ్రైవింగ్‌ చేసే వారి లైసెన్సులను రద్దు చేసేలా, ఇతర సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌ ఇలా ఏది చేసినా ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు రాసి జరిమానాలు విధించడమే కాదు. పాయింట్లను జోడిస్తున్నారు. ఈ సమాచారం ఎప్పటికిప్పుడు ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌లో అప్‌డేట్‌ అవుతోంది.

 

 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించడంతో తార స్థాయిలో ఉంటోంది. రవాణా శాఖ అధికారులు ఆర్టీఏ ఎం-వ్యాలెట్‌ను ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీల సమయంలో వాడే ట్యాబ్లెట్‌ పీసీల్లోని సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేయడంతో చలాన్ల వివరాలను ఎప్పటికప్పుడు క్షణల్లో అప్‌డేట్‌ అవుతున్నాయని ఆర్టీఏ అధికారులు తెలిపారు.

 

 

మొబైల్‌లో డ్రైవింగ్‌ లైసెన్సు నెంబరు, పుట్టిన తేదీ, ఏ ఆర్టీఏ కార్యాలయం నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నది ఎంట్రీచేస్తే చాలు. క్షణాల్లో యాప్‌ మొత్తం వివరాలను వెల్లడిస్తుంది. ఇందుకు అనుగుణంగా రవాణాశాఖ పాస్‌వర్డ్‌ కేటాయిస్తుంది. వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్టు కూడా ఇదే తరహాలో రికార్డు చేసుకోవచ్చు. ఒకసారి మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫాంలపై డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 

 

ఒకసారి డౌన్‌లోడ్‌చేసిన డాక్యుమెంట్లు మొబైల్‌లో శాశ్వతంగా ఉండిపోతాయి. వాహనానికి సంబంధించిన చలానాలు ఎన్ని ఉన్నాయి. ఎంత చెల్లించాలి అనే సమాచారం ఉంటుంది. ఈ యాప్‌లోంచే చెల్లింపులు చేయవచ్చు. వాహనాలకు సంబంధించిన భీమా వివరాలు సైతం ఎప్పటికప్పుడు జోడించడబడుతూ ఉంటాయి. మరో 3-4 నెలల్లోనే వాహన కాలుష్య తీవ్ర తెలియజేసేలా ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను రూపొందించి ఎం-వ్యాలెట్‌తో అనుసంధానం చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: