జగన్ సర్కారు నవరత్నాలను ఎంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందో చూస్తూనే ఉన్నాం.. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే నవరత్నాలుగా రూపొందించిన జగన్ వాటినే బైబిల్, ఖురాన్, భగవద్గీతగా పాటిస్తానని ఎన్నోసార్లు చెప్పారు. ఆ మాటే అమలు చేస్తున్నారు. కరోనా వంటి కష్ట సమయంలోనూ మాట తప్పకుండా హామీలు నెరవేరుస్తున్నారు.

 

 

అయితే ఈ నవరత్నాలు తర్వాత అమలు చేయడం కష్టమవుతుందా.. జగన్ వీటిని కొనసాగించలేడా.. ఈ విషయంలో జగన్ కు భంగపాటు తప్పదా..అంటే అవునంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నేత జెసి దివాకరరెడ్డి మరోసారి జగన్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన నవరత్నాలను వచ్చే ఏడాది బడ్జెట్ తర్వాత కొనసాగించలేరని ఆయన జోస్యం చెప్పారు.

 

 

జగన్ నవరత్నాలను కొనసాగించాలంటే ప్రభుత్వ భూములు అమ్మవలసి ఉంటుందని జేసీ చెబుతున్నారు. నవరత్నాలు కొనసాగిస్తే.. జగన్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేరని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. ఇదే సమయలో జేసీ బ్రదర్స్ పై కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు అంశాలపైనా జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. జగన్ సర్కారు కక్షసాధింపు చర్యలకు తలొగ్గేది లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

 

 

జగన్ ఎంత సేపటికీ ఆదాయం పంచే కార్యక్రమాలు తప్ప.. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టులు ఏమీ చేపట్టడం లేదని జేసీ విమర్శించారు. జగన్ ఇప్పటికే తన ట్రాన్స్ పోర్టు, మైనింగ్ వ్యాపారాలను దెబ్బ తీశారని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు. అయితే తనకు వ్యవసాయం ఉందని.. తనకు ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని జేసీ దివాకర్ రెడ్డి అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: