ఈ మద్య కొంత మంది కృర మృగాల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే.  ఇందుకు సాక్ష్యం ఆ మద్య కేరళలో ఏ గర్భంతో ఉన్న ఏనుగు చావు.  మానవ తప్పిదం వల్ల బాంబ్ తిని నోరు పగిలి ఎలాంటి ఆహారం లేకుండా పద్నాలు రోజుల పాటు ఆ బాధ తట్టుకోవడానికి నీటిలోనే నిలబడి చనిపోయింది.  ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో దారుణ సంఘటనలు వెలుగు లోకి వచ్చాయి. ఇలాంటి భయంకరమై మనుషుల మద్య పశు పక్ష్యాదులపై మానవత్వం, మంచితనం చాటుకునే వారు కూడా ఉన్నారు.  తాజాగా నెమలికి ఫారెస్ట్ అధికారులు ఘ‌నంగా అంతిమయాత్ర నిర్వ‌హించారు. స్థానికులతో కలిసి ఊరేగింపుగా పాడెను మోసుకుంటూ తీసుకెళ్లి ఖననం చేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జరిగింది..  ఆ అధికారులను నెటిజన్లు ఎంతగానో మెచ్చకుంటున్నారు.

 

విద్యుదాఘాతంతో చనిపోయిన జాతీయ పక్షి నెమలి చనిపోయింది. ఈ విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. వెంటనే అక్కడికి వచ్చిన అధికారులు పోసస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత శ్మశానవాటికలో హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం దహనం చేశారు. ఈ విషయం తెలిసి స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

నిజంగా ఈ కాలంలో కరోనా భయంతో మనుషులు చనిపోతే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.. ఇలాటి సమయంలో ఓ పక్షికి సాంప్రదాయంగా అంత్యక్రయిలు జరిపించడం నిజంగా ఆ అధికారుల మంచి మనసుకు అందరూ తెగ మెచ్చుకున్నారు.  ఇంకా మనుషుల్లో మానవత్వం దాగి ఉందని.. మూగ జీవాలపై ప్రతి ఒక్కరూ ప్రేమ చూపించాలని కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: