కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ బిల్లుకు వ్యతిరేకంగా జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలో తీర్మానం తీసుకోవడం జరిగింది. గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష ఈ తీర్మానాన్ని అసెంబ్లీ భోజన విరామ సమయంలో ప్రవేశ పెట్టడం జరిగింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ బిల్లును రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటులో ప్రవేశ పెట్టడం జరిగింది. అప్పట్లో ఈ అంశంపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు, నిరసనలు వ్యతిరేకత వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ భాష మాట్లాడుతూ...ఎన్ పీఆర్ (నేషనల్ పాపులేషన్ ఆఫ్ రిజిస్ట్రార్) లో కొత్తగా పొందుపరచిన అంశాలు ముస్లింలో భయాందోళనలు రేకెత్తాయని అన్నారు.

 

2020లో చేసిన ఫార్మాట్ లో తల్లిదండ్రుల వివరాలు, పుట్టిన తేదీ, ప్రదేశం, మాతృభాష.. ఇలా కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో 2010 ప్రకారం ఉన్న ఎన్ పీఆర్ ను అమలు చేయాలని తాము కేంద్రాన్ని కోరామన్నారు. గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలు చేయడం లేదని తెలపడం జరిగింది. ఈ మేరకు మార్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు బిల్లులకు వ్యతిరేకంగా తీర్మానం చేసినట్లు తాజాగా అసెంబ్లీలో గుర్తు చేశారు.

 

రెండు రోజులు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎన్‌ఆర్‌పీ, ఎన్‌పిఆర్‌ సవరణ బిల్లులను కూడా శాసనసభ ఆమోదించింది. ఈ రెండు బిల్లుల విషయంలో ఏమాత్రం కేంద్రంతో ఏకీభవించేది లేదని ఢిల్లీకి నేరుగా ఈ పరిణామాలతో జగన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులకు వ్యతిరేకంగా ఆమోదముద్ర వేయడంతో… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: