ఏపీ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులను వైసీపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ భావిస్తుండగా, ఇప్పుడు వైసీపీ ఎంపీలను తమ వైపుకు లాక్కుని పార్టీలో చేర్చుకోవాలని బిజెపి వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తోంది. ముందుగా రఘురామకృష్ణరాజు తో మొదలు పెట్టి పెద్ద ఎత్తున వైసీపీ ఎంపీలకు గేలం వేసే పనిలో బీజేపీ వ్యవహరిస్తున్నట్లు ఇప్పుడు వైసిపి అనుమానిస్తోంది. మొన్నటి వరకు తమతో మిత్రపక్షంగా ఉంటూ వచ్చిన బిజెపి ఆకస్మాత్తుగా ఈ విధంగా వ్యవహరించడం వెనుక కారణాలు ఏంటో తెలియక వైసిపి ఆందోళన చెందుతోందట. ప్రస్తుతం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో వైసిపి ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచుతున్నారు. ఆయన వెనుక బిజెపి ఉందని, బీజేపీ అండతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే  అనుమానాలు వైసీపీ నుంచి వ్యక్తమవుతున్నాయి.

 


 ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు ఒక్కరే కాకుండా మరి కొంత మంది ఎంపీలు వైసీపీపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ అప్రమత్తమైంది. ఈ మేరకు వైసీపీ ఎంపీ లకు బీజేపీ నుంచి ఆఫర్లు వస్తున్నట్టుగా వైసీపీ దగ్గర సమాచారం ఉందట. ఏపీలో బలమైన పార్టీగా తయారవ్వాలని చూస్తున్న బీజేపీ ఏదో రకంగా వైసీపీని దెబ్బ తీస్తే వచ్చే ఎన్నికల నాటికి తమ కు అవకాశం ఉంటుందని, ఎలాగో అప్పటికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోతుందని అంచనా వేస్తోంది. అందుకే పెద్ద ఎత్తున వైసిపి ఎంపీలను బిజెపిలో చేర్చుకోవాలనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

IHG

 ప్రస్తుతం రఘురామకృష్ణరాజు వ్యవహారం ఒక్కటే బయటపడిందని, మిగతా ఎంపీలు కొంతమంది చాపకింద నీరులా వైసీపీపై అసమ్మతి గళం వినిపించేందుకు సిద్ధం అవుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి బిజెపి నుంచి అన్ని రకాలుగా అండదండలు ఉన్నాయనే సమాచారం ఇప్పుడు వైసీపీ లో కలవరం పుట్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: