దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి అందరికి తెలిసిన విషయమే. ఎల్‌ఐసీ ఎన్నో రకాల పాలసీలు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మనీ బ్యాక్ పాలసీలు, ఎండోమెంట్ పాలసీలు, టర్మ్ పాలసీలు ఇలా ఎన్నో రకాల ప్లాన్స్ అందిస్తోందన్నారు. జీవన్ లక్ష్య ప్లాన్ కూడా వీటిల్లో ఒకటి.

 

 

ఈ ప్లాన్ నాన్ లింక్డ్ ఎండోమెంట్ ప్లాన్. ఒకవేళ పాలసీదారుడు మెచ్యూరిటీ కన్నా ముందు మరణిస్తే నామినీకి బీమా డబ్బుల్లో ప్రతి ఏడాది 10 శాతం చొప్పున చెల్లిస్తూ వస్తాయన్నారు. పాలసీదారుడు ప్లాన్ మెచ్యూరిటీ తర్వాత కూడా జీవించి ఉంటే అప్పుడు పాలసీ డబ్బులను, బోనస్‌తో కలిపి అందజేస్తామన్నారు. అంతేకాకుండా మార్కెట్ రిస్క్‌లతో ఈ పాలసీకి ఎలాంటి సంబంధం ఉండదన్నారు.

 

 

కనీసం రూ.లక్ష మొత్తానికి ఈ ఎల్‌ఐసీ పాలసీ తీసుకోవాలి. గరిష్టంగా రూ.10 లక్షల వరకు బీమా మొత్తానికి ఎల్‌ఐసీ జీవన్ లక్ష్య ప్లాన్‌లో చేరవచ్చునన్నారు. 13 ఏళ్ల నుంచి 25 ఏళ్ల కాలంపాటు పాలసీదారుడు ప్రీమియం మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆటోమేటిక్‌గా బ్యాంక్ అకౌంట్ నుంచి ప్రీమియం డబ్బులు కట్ అవుతాయని తెలిపారు.

 

 

18 నుంచి 50 ఏళ్ల మధ్యలో వయసు కలిగిన వారు ఈ పాలసీలో చేరొచ్చునన్నారు. 25 ఏళ్ల వయసులో ఉన్న వారు 25 ఏళ్ల కాల పరిమితితో రూ.10 లక్షల మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలవారీ ప్రీమియం దాదాపు రూ.3,600 వరకు ఉంటుందన్నారు. అంటే రోజుకు రూ.115 ఆదా చేసుకోవాలి. ప్రీమియం 22 ఏళ్లపాటు చెల్లించాలని తెలిపారు.

 

 

పాలసీదారులకు మెచ్యూరిటీ సమయంలో మొత్తంగా రూ.26 లక్షలకు పైన లభిస్తాయన్నారు. ఇందులో బీమా మొత్తం రూ.10 లక్షలు. అలాగే రూ.12.25 లక్షల బోనస్ లభిస్తుందన్నారు. ఫైనల్ అడిషనల్ బోనస్ కింద రూ.4.5 లక్షలు వస్తాయన్నారు. దీంతో మొత్తంగా మెచ్యూరిటీ సమయంలో రూ.26.75 లక్షలు పొందొచ్చునన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: