మొదటి నుండి వైసీపీ పార్టీ నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటిలో చూసి చూడనట్లు వదిలేసిన అధ్యక్షుడు జగన్ తాజాగా మాత్రం గట్టిగానే రఘురామకృష్ణంరాజు పై ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాల్లో టాక్. ఇటీవల తన సొంతంగా గెలిచినట్లు పార్టీ అధిష్టానం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తనపై విమర్శలు చేసిన ఎమ్మెల్యేలను రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని రఘురామకృష్ణంరాజు చాలెంజ్ చేయటం పట్ల జగన్ సీరియస్ అయినట్లు ఒక ఎంపీ పార్టీ నుంచి వెళ్లిపోవడం వల్ల పెద్ద నష్టం ఏమీ ఉండదని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

దీంతో త్వరలోనే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కి తొలుత షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆ తరువాత వివరణ తీసుకొని జగన్ సస్పెండ్ చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇప్పటికే రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు వైసీపీ అధిష్టానం దగ్గర సమాచారం కూడా ఉందట. దీంతో బీజేపీలోకి వెళ్ళటానికి పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకోవడానికి కావాలని రఘురామకృష్ణంరాజు విమర్శలు చేస్తున్నారు అనే వాదన వైసీపీ పార్టీలో వినబడుతుంది.

 

అయితే పదే పదే విమర్శలు చేయడం దీనిపై పార్టీ అధిష్టానం నివేదిక రఘురామకృష్ణంరాజు ని కోరినట్లు వార్తలు అందుతున్నాయి. నివేదిక వచ్చిన వెంటనే రఘురామకృష్ణంరాజు పై వైయస్ జగన్ గట్టిగానే చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి దాకా చూసి చూడనట్లు వదిలేసిన జగన్ ఈసారి మాత్రం రఘురామకృష్ణంరాజు విషయంలో రాజీ పడకూడదు తాడోపేడో తేల్చుకోవడానికి, పార్టీ నుండి సస్పెండ్ చేయడం కోసం జగన్ ఆల్రెడీ డిసైడ్ అయిన టాక్. ప్రస్తుతం ఎంపీ రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ మాత్రం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: