ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశానికి మరొక దేశానికి మధ్య ఒప్పందం ఉంటుంది. ఉదాహరణకు మన దేశానికి బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా, అమెరికా దేశాలతో కొన్ని ఒప్పందాలు ఉంటాయి. అంతే తప్ప అమెరికాలోని రిపబ్లికన్ పార్టీతో ఎటువంటి ఒప్పందాలు ఉండవు. అమెరికాలో ఉండే మరో పార్టీతో కాంగ్రెస్ కు ఎటువంటి ఒప్పందం ఉండదు. కానీ అలాంటి విచిత్ర ఒప్పందం మన దేశంలోని కాంగ్రెస్ కు చైనాలోని కమ్యూనిస్టు పార్టీకి జరిగింది. 
 
2008లో ఇరు దేశాల పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం గురించి ఎటువంటి స్పష్టత లేదు. చైనాలో ఉండే కమ్యూనిస్టు పార్టీ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోంది. సరికొత్త సామ్యాజ్యవాద ధోరణిని చైనా అవలంబిస్తోంది. అమెరికాది కూడా సామ్రాజ్యవాద ధోరణి అయినప్పటికీ ఆ దేశం ఆయిల్ నిల్వ కొరకు, ఆదాయం కొరకు ఇతర దేశాలపై ఆధిపత్యం చలాయిస్తూ ఉంటుంది. చైనా మాత్రం పక్క దేశాల భూభాగాలను స్వాహా చేస్తోంది. 
 
చైనా టిబెట్, హాంగ్ కాంగ్, తైవాన్ భూభాగాలను ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తూ చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ ఉంటుంది. అలాంటి చైనా భారత్ భూభాగాన్ని కబ్జా చేసి.... యుద్ధం చేసి ఓడించిన సమయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ చైనాలోని పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం గురించి కాంగ్రెస్ ఎలాంటి విషయాలను వెల్లడించలేదు. 
 
అనంతరం డోక్లాం వివాదం సమయంలో వాళ్ల రాయబారితో సోనియా, రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏం జరిగింది....? గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి....? అనే విషయాలు తెలియాల్సి ఉంది. సాధారణంగా ఎక్కడైనా దేశాల మధ్య ఒప్పందాలు ఉంటాయి కానీ రెండు వేరువేరు దేశాల పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం గురించి వివరాలు బయటకు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఎప్పుడు బయట పెడుతుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: