ప్రస్తుతం చైనా - ఇండియా మధ్య జరుగుతున్న వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంపైన ప్రముఖులు అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి రామ్‌ దాస్‌ అథావలే చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

చైనీస్ ఫుడ్‌ను అమ్మే రెస్టారెంట్ల అన్నింటిని భారత్‌లో నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. అన్యాయంగా 20 మంది భారత జవాన్లను చైనా పొట్టనపెట్టుకుందని మండిపడ్డారు. దీంతో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా చైనా ఆహార పదార్థాలను, వాటిని అమ్మే రెస్టారెంట్లను బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. 

 

IHG

 

ఆహార పదార్థాలే కాకుండా, చైనాలో తయారైన అన్ని రకాల వస్తువులను వదిలించుకోవాల్సిన సమయం వచ్చిందని అయన ట్విటర్ వేదికగా పిలునిచ్చారు. అయితే కేంద్ర మంత్రి రామ్‌ దాస్‌ అథావలే ఇలా స్పందించగా నిన్నటికి నిన్న చైనాకు సంబందించిన 50కి పైగా యాప్‌లను నిషేధించాలి అని భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు సూచించాయి. ప్రజలు కూడా ఆ యాప్స్ ని వెంటనే డిలేట్ చెయ్యాలి అని పేర్కొన్నాయి.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: