జగన్ ఒక సారి దెబ్బ తిన్నారు. కానీ పదే పదే అదే దెబ్బ తింటారని అనుకోవడమే పొరపాటు. ఇదే మాటను జగన్ స్వయంగా నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత అన్నారు. అవును నిజమే మేము దెబ్బ తిన్నాం. కానీ ఈ దెబ్బకు దెబ్బ తీస్తామని చెప్పారు. అలాగే జగన్ చేసి చూపించారు. ప్రత్యర్ధుల మాడు పగిలే విధంగా 2019 ఎన్నికల్లో  బంపర్ మెజారిటీతో జగన్ భారీ ఎత్తున సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చారు.

 


ఇపుడు శాసనమండలి కధకు వస్తే ఆరు నెలల క్రితం ఏదైతే టీడీపీ వ్యూహం అనుసరించిందో ఇపుడూ అదే విధంగా వ్యవహరించింది. మూడు రాజధానుల బిల్లుని అటకెక్కించాలనుకుంది. అందుకే సభలో  గొడవ, గందరగోళం జరిగాయి కానీ బిల్లులేవీ చర్చకు రాకుండానే సభ వాయిదా పడింది. ఇపుడు చూసుకుంటే తాము మూడు రాజధానులు బిల్లు అమలుకాకుండా చేశామని టీడీపీ నేతలు గొప్పగా  చెప్పుకోవచ్చు కానీ జరుగుతున్నది వేరు.

 

జగన్ కి తెలుసు కదా. ఇలాగే టీడీపీ చేస్తుందని. అందువల్ల జగన్ ఈసారి ఏకంగా ఆ బిల్లులను గవర్నర్ కి పంపించి అటు నుంచి  అమోదముద్ర వేయించుకోవాలనుకుంటున్నారు. గవర్నర్ బిల్లులు ఆమోదిస్తే చాలు అది చట్టం అవుతుంది. శాసన ప్రక్రియ కూడా పూర్తి అవుతుంది. ఇపుడు అదే ఆలోచనతో జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు.

 

అయితే దీనికి ఒక నెల సమయం అవసరం. ఎందుకంటే శాసన‌ మండలికి పంపించిన బిల్లు విషయంలో నెల రోజుల్లోగా ఏ అభిప్రాయం చెప్పకపోతే అది కూడా రెండు సార్లు జరిగాక అలా జరిగితే మాత్రం ఇక ఏకంగా గవర్నర్ కి బిల్లులు పంపించి ఆమోదం వేయించుకోవచ్చు. ఇపుడు అదే చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని సమాచారం.

 

అంటే జగన్ మూడు రాజధానుల కధను ఈ విధంగా తనదైన వ్యూహంతో నరుక్కువచ్చారన్న మాట. ఇపుడు టీడీపీ శాసనమండలి ఉంది, అక్కడ బలం ఉంది అని ఎన్ని కబుర్లు చెప్పినా కుదిరేది కాదు జూలై నెలలో కచ్చితంగా మూడు రాజధానుల బిల్లు చట్టం అవుతుంది అని వైసీపీ వర్గాలు గట్టిగా చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: