తెలంగాణ‌లో రోజురోజుకీ పెరుగుతోన్న క‌రోనా వైర‌స్ కేసుల‌‌తో ప్ర‌జ‌లు వ‌ణికిపోయే ప‌రిస్థితి నెల‌కొంది.. ముఖ్యంగా జీహెచ్ఎంసీ క‌రోనా కేసుల‌కు హాట్‌స్పాట్‌గా మారిపోయింది.  ఈ మద్య లాక్ డౌన్ సడలింపు చేసిన తర్వాత వరుసగా కేసులు పెరిగిపోవడం మొదలయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే.. ప్ర‌తీరోజూ న‌మోద‌వుతోన్న క‌రోనా కేసుల్లో అగ్ర‌స్థానం హైద‌రాబాద్‌దే.. అయితే, ఏమాత్రం బాధ్య‌త‌లేకుండా రోడ్ల‌పైకి వ‌చ్చి ఇత‌రుల‌ను ఇబ్బందిపెట్టేవారు లేక‌పోలేదు. ఇక్కడే మరణాల సంఖ్య కూడా భారీగా నమోదు అవుతున్నాయి. దాంతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది.. పరీక్ష కేంద్రాలు పెంచారు.  అయితే కొన్ని రోజులుగా మార్కెట్ వ్యవస్థలో ఎక్కువగా కరోనా వచ్చిన సంఘటనలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

 

దాంతో ఇక్కడ కొంత మంది మార్కెట్ యజమానుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. క‌రోనా ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లో స్వచ్చందంగా లాక్‌డౌన్ విధించుకున్నారు వ్యాపార‌స్తులు.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే షాపుల‌ను తెర‌వాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.. సాయంత్రం 4 గంట‌ల త‌ర్వాత ఎవ‌రైనా షాపుల‌ను మూసివేయాల్సిందేన‌ని తీర్మానం చేసింది మార్కెట్ అసోసియేషన్.

 

హోల్‌సెల్ మార్కెట్‌కి పెట్టింది పేరైన బేగంబజార్‌తో పాటు ఫిల్ ఖనా, సిద్ధి అంబర్ బజార్‌ల్లోని అన్ని షాపులు స్వ‌చ్ఛందంగా మూసివేయ‌నున్నారు.  ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా మార్కెట్ లో కూడా ఎక్కువ జనాల రాకపోలు పూర్తిగా తగ్గాయని దాంతో  గిరాకీలు కూడా స‌రిగా లేక‌పోవ‌డంతో ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని చెబుతున్నారు షాపుల య‌జ‌మానులు.  కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి షాపులు తిసే సమయం మార్చుకోవచ్చని వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: