కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం దేశంలో గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి ఎన్నికలు అయినా పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ప్రతి రాష్ట్రంలో నెలకొంది. కానీ దక్షిణాది రాష్ట్రాలలో మాత్రం దానికి రివర్స్ గా ఉంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి సాధారణంగా పోటీ అధికారంలో ఉన్నా లేకపోయినా గట్టిగాన్నే ఉంటుంది. ఇటువంటి తరుణంలో కర్ణాటకలో జరగబోయే మరో ఎన్నికలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సవాల్ గా మారాయి. త్వరలో కర్ణాటక రాష్ట్రంలో జరగబోయే అయిదు శాసనమండలి స్థానాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రెండు మరియు బీజేపీ  రెండు అదేవిధంగా జనతాదళ్ ఎస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. పార్టీ బలాబలాలు చూసుకుంటే ప్రతి పార్టీకి పదవులు దక్కే అవకాశం ఉంది.

 

ఈ తరుణంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ లకు సమాన స్థానాలు సీట్లు రానున్నాయి. అదేవిధంగా బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీ లలో ఎవరు శాసనమండలి సభ్యులు అనేది అధిష్టానం నిర్ణయించడం జరుగుతోంది. ఇదిలా ఉండగా కొత్తగా ఎన్నికైన వారి పదవీకాలం కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అయినా కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో రెండు స్థానాలు కోసం దాదాపు 40 మంది పోటీ పడుతున్నారు. దీంతో వీరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్న దాని విషయంలో కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ తలమునకలవుతున్నారు.

 

ఈ విషయంలో ఎవరికీ సపోర్ట్ చేసినా మొత్తానికి పార్టీ నుండి వ్యతిరేకం వచ్చే అవకాశం ఉందని డీకే శివకుమార్.. అభ్యర్థుల సెలక్ట్ చేయటం విషయంలో నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా రెండు స్థానాల కోసం పోటీ పడుతున్న 40 మంది అభ్యర్థుల లో సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారు కూడా ఉండటంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల పోటీ అభ్యర్థుల కోసం అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని భావించి ఈ విషయాన్ని అధిష్టానానికి అప్పజెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఈ 40మంది లో రెబల్ గా పోటీ చేయడానికి కొంతమంది రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: