సాధారణంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు అంటే రాజకీయాలు తెలిసిన ప్రతిఒక్కరికి బాగా ఆసక్తి ఉంటుంది. అసెంబ్లీలో అధికార-ప్రతిపక్ష నేతల మధ్య జరిగే మాటల యుద్ధం ఎక్కువ జరుగుతుంది కాబట్టి...అందరూ అసెంబ్లీ సమావేశాలు చూడటానికి ఇంటరెస్ట్ చూపిస్తారు. అయితే పెద్దల సభగా పిలిచే మండలి సమావేశాలు చూడటానికి ఎవరు ఆసక్తి కనబర్చరు. ఎందుకంటే అందరూ పెద్దవాళ్లే ఉంటారు కాబట్టి...అంతగా ఆసక్తికరమైన సన్నివేశాలు జరగవు.

 

కానీ ప్రస్తుతం మాత్రం రివర్స్‌లో జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల కంటే మండలి సమావేశాలే ఎక్కువ రసవత్తరంగా ఉంటున్నాయి. తాజాగా జరిగిన సమావేశాలే అందుకు ఉదాహరణ. సమావేశాలు రెండు రోజులే జరిగిన సరే...మండలిలో వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగింది. సభలో దూషణల పర్వం నడిచింది. మూడు రాజధానుల బిల్లు మళ్ళీ మండలికి వచ్చిన నేపథ్యంలో దానిపై చర్చ జరపాలని వైసీపీ వాళ్ళు కోరగా, కాదు ముందు బడ్జెట్ బిల్లు పెట్టాలని టీడీపీ వాళ్ళ డిమాండ్.

 

ఈ క్రమంలోనే మండలిలో వాగ్వాదాలు నడిచినట్లు తెలుస్తోంది. ఎలాగో మండలిలో టీడీపీకి బలం ఉంది కాబట్టి, వారి చెప్పినట్లే నడుస్తోంది. ఇక దీనికి వైసీపీ ఎమ్మెల్సీలకు, మంత్రుల నుంచి ధీటుగా స్పందించి ఉంటారు. అయితే ఈ రగడని అంతా లోకేష్ వీడియో తీస్తుండటం, ఆయనని మంత్రులు అడ్డుకునే క్రమంలోనే అసలు రచ్చ మొదలైనట్లు తెలుస్తోంది. ఇక్కడే మంత్రి అనిల్ తొడగొట్టి సవాళ్ళు చేశారని, మంత్రులు తమపై దాడి చేయడానికి చూశారని, మండలి వీడియోని ఉన్నది ఉన్నట్లుగా బయట పెట్టాలని టీడీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.

 

ఆహా కాదు టీడీపీ వాళ్లే తమపై దాడి చేశారని, తనతోపాటు ఇతర మంత్రులపై టీడీపీ ఎమ్మెల్సీలు బీదా రవిచంద్రాయదవ్, దీపక్ రెడ్డిలు దాడికి పాల్పడ్డారని మంత్రి వెల్లంపల్లి చెబుతున్నారు. అయితే ఇక్కడ రెండుపక్షాల నేతలు గొడవపడ్డారని తెలుస్తోంది. ఒకరిని తిట్టుకుని, కొట్టుకున్నారని తెలుస్తోంది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు లోకేష్ తీసిన వీడియోలో ఏముందో ఎవరికి తెలియడం లేదు.

 

కానీ లోకేష్ మాత్రం తాను ఎలాంటి ఫోటోలు, వీడియోలు తీయలేదని చెబుతున్నారు. అయితే ఆయన మాత్రం వీడియో, ఫోటోలు తీశారనేది వైసీపీ వాదన. వాస్తవానికి లోకేష్ దగ్గర వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వీడియోలని సడన్‌గా బయటపెట్టొచ్చని సమాచారం. మరి ఆ వీడియోల్లో ఏముంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: