తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత‌ srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ హైద‌రాబాద్ గురించి ఓ భారీ, ఆశ్చ‌ర్య‌క‌ర‌, ముఖ్య‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న ఎంద‌రినో ఆక‌ర్షించేది. అదే స‌మ‌యంలో చాలా మందిని నిరుత్సాహానికి గురిచేసేది. చెప్పాలంటే..నాయ‌కుల మాట‌ల‌కు... చేతల‌‌కు మ‌ధ్య ఉన్న తేడాను స్ప‌ష్టంగా తెలియ‌జేసేది. అందుకే మంత్రి గారు మంచి మాట చెప్పినా...గ‌తంలో జ‌రిగిన ప‌రిణామాలు, సంఘ‌ట‌న‌ల‌ను చూస్తే...ఆచ‌ర‌ణ‌పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇంత‌కీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమ‌న్నారంటే.. హైద‌రాబాద్‌లో వాణిజ్య సముదాయాల ముందు ఉన్న ఫుట్ ఫాత్ ల‌ను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు.!

 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందున్న లోకల్ బస్ స్టాప్ ను మోడల్ బస్ స్టేషన్ గా ఆదునికరించే పనులను మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ట్రాఫిక్, లా అండ్ ఆర్థర్ పోలీసు అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని  మాట్లాడుతూ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధి జరుపుతున్నామని పేర్కొన్నారు. చిన్న వ్యాపారస్తుల పొట్ట కొట్టడం లేద‌ని.. అందరిని సంతోషంగా ఉంచడమే తెలంగాణ ప్రభుత్వ ద్యేయమని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ తెలిపారు... ప్రభుత్వమే అన్ని చేయాలంటే కుదరదు.. నేను బాగుండాలి, నా పరిసర ప్రాంతాలు బాగుండే విదంగా చూసుకోవాల్సిన బాధ్యత తనదే అన్న చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ``వందల కోట్లు ఖర్చు చేసి రోడ్లు, ఫుట్‌పాత్, పరిసర ప్రాంతాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దానిని కాపాడు కోవలసింది పోయి వాటినే దుర్వినియోగం చేస్తే సహించేది లేదు` అని హెచ్చ‌రించారు కూడా!

 


మంత్రి త‌ల‌సాని చేసిన ప్ర‌క‌ట‌న ఎంద‌రినో ఆక‌ట్టుకునేది. న‌గ‌రంలోని దాదాపు అన్ని దుకాణ స‌ముదాయాల ముందున్న ఫుట్ పాత్ స్థ‌లం క‌బ్జాకు గుర‌యింది. త‌మ ఆస్తిలాగా దాన్ని భావించే ఓన‌ర్లు, కిరాయిదారుల‌తో దుకాణాల ముందు ఫుట్ పాత్ అనేది ఓ పెద్ద సందేహంగా మారింది. దీనిపై ఆవేద‌న చెందిన కొంద‌రు కోర్టుల‌కు వెళ్లారు. న్యాయ‌స్థానాలు తీర్పులు ఇచ్చినా...మ‌న అధికారులు అమ‌లు చేయ‌లేదు. ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు మంత్రిగారు చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌తో ప‌రిస్థి‌తిలో మార్పు వ‌స్తుందా?  ఆశ‌తో వేచిచూద్దాం.! 

మరింత సమాచారం తెలుసుకోండి: