వరుసగా ఎదురు దెబ్బలు తింటూ వస్తున్న తెలుగుదేశం పార్టీ మళ్లీ పునర్ వైభవం సాధించే దిశగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వేధింపులు కారణంగా టిడిపి శ్రేణులు భయభ్రాంతులకు గురయ్యారు. వారికి భరోసా కల్పించే విధంగా తగిన ప్రణాళికలు రూపొందించకపోతే పార్టీ పరిస్థితి మరింతగా దిగజారుతుందనే అంచనాకు బాబు వచ్చారు. ఇప్పటికే పార్టీని వదిలి అనేక మంది నేతలు వెళ్లిపోగా, చాలామంది మరికొద్ది రోజుల్లోనే వైసిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు అనే ఆందోళన చంద్రబాబు లో ఎక్కువగా ఉంది. పార్టీ నాయకులతో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త కమిటీలను చంద్రబాబు నియమించబోతున్నారు. 

IHG


అలాగే పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గాన్ని  కూడా చంద్రబాబు మార్చే ఆలోచనలో ఉన్నారు. ఎక్కువగా బలహీనవర్గాల వారికి పార్టీలో పెద్దపీట వేయాలని బాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే కమిటీల నియామకం పూర్తి చేయాలని చేస్తున్నారు. అప్పుడే ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఈ ఏడాదిలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మరో నాలుగేళ్ల పాటు అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోవలసి ఉండడంతో ఇప్పటి నుంచే చంద్రబాబు కసరత్తు మొదలు పెట్టారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇప్పటి కే కొంత మంది పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీలోని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం...

 


శ్రీకాకుళం గౌతు శిరీష, విజయనగరం మాజీ ఎమ్మెల్యే కె ఏ నాయుడు, విశాఖ వాసుపల్లి గణేష్, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, కాకినాడ జ్యోతుల నెహ్రూ, బందరు బచ్చుల అర్జునుడు, గుంటూరు ఆలపాటి రాజా, బాపట్ల నక్కా ఆనందబాబు, నరసరావుపేట యరపతినేని శ్రీనివాస్, ఒంగోలు దామచర్ల జనార్ధన్, నెల్లూరు బీద రవిచంద్ర, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సునీల్, కడప శ్రీనివాస్ రెడ్డి, కర్నూల్ మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి, హిందూపురం పార్థసారథి, నంద్యాల ఎన్. ఎండి ఫరూక్ పేర్లు ఖరారు అయినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లిస్ట్ బయటకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: