అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో విశాఖపట్నంలో జరిగిన ఎల్జి పాలిమర్స్ ఘటన దేశంలోనే పెద్ద హైలెట్ గా నిలిచింది. ఒక్కసారిగా విషవాయువు అర్ధరాత్రి కంపెనీ నుండి రిలీజ్ కావటంతో చాలామంది నిద్రలోనే స్పృహ తప్పి పడిపోయారు. ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టం అయిపోయింది. గ్యాస్ లీక్ ఘటనలో ఒక మనుషులే కాకుండా పశువులు మరియు పంట పొలాలు కూడా నష్టం అయిపోయాయి. ఈ ఘటనలో ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులకు చనిపోయినవారికి భారీ స్థాయిలో ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఘటనలో బాధితుల ఈ విషయంలో పరామర్శించడానికి చంద్రబాబు విశాఖపట్నం రాకపోవడానికి గల తాజాగా బయటపడింది.

 

మామూలుగా కరోనా వైరస్ కారణం గా అప్పట్లో చంద్రబాబు హైదరాబాద్ నగరంలో తన సొంత ఇంటిలో ఉండటం అందరికీ తెలిసిందే. ఆ తరువాత మహానాడు జరిగిన కార్యక్రమం ఈ సందర్భంలో రాష్ట్రంలో అడుగు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మళ్లీ హైదరాబాద్ వెళ్ళిపోయారు. అయితే నిజంగా ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంపై ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఆ టైంలో చంద్రబాబు విశాఖ పట్టణానికి వచ్చి ఎల్జి పాలిమర్స్ ఘటనపై ఎందుకు స్పందించలేదని ఇటీవల ఓ విషయంలో విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే, ఈ మొత్తం వ్య‌వ‌హారంపై టీడీపీ నేత‌లు ఫుల్ సైలెంట్ అయిపోయారు.

 

అయితే, దీనిపై తాజాగా తెలిసిన విష‌యం ఏంటంటే.. ఢిల్లీ నుంచి చంద్ర‌బాబు కు సందేశం అందింద‌ని, విశాఖ వెళ్లి ఎల్జీ విష‌యాన్ని రాజ‌కీయం చేయ‌ద్ద‌ని కూడా ఆయ‌నకు సూచ‌న‌లు అందాయ‌ని అందుకే బాబు సైలెంట్ అయిపోయార‌ని తెలిసింది. ఈ విషయంలో బీజేపీ ని కూడా ఇరుకున పెట్టే విధంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వ్యవహరించడంతో అప్పట్లో ఢిల్లీలో చంద్రబాబు గురించి డిస్కషన్ జరిగినట్లు వెంటనే కేంద్ర పెద్దలు రాష్ట్ర బీజేపీ నేతలతో మంతనాలు జరిపి ఈ విషయంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ గాని మీరు గాని రాజకీయాలు చేయకూడదు అని ఆదేశాలు ఇవ్వటం జరిగినట్లు వార్తలు ఇటీవల బయటపడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: