ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ రాజకీయాలు చాలా వరకు ఎప్పుడు వేడి వేడి గానే ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ విభజన జరిగిన తర్వాత గానీ బెజవాడ రాజకీయాలు మాత్రం చాలా కీలకం. ఇదిలా ఉండగా గత సార్వత్రిక ఎన్నికల టైంలో జగన్ మానియా రాష్ట్రమంతటా ఉన్నాగాని విజయవాడలో తన పార్లమెంటు స్థానాన్ని సుస్థిరంగా కాపాడుకున్నాడు కేశినేని నాని. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుని అయినా విమర్శించే, ప్రశ్నించే సత్తా నాయకుడు కేశినేని నాని. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ టీడీపీ ఎంపీ విజయవాడ నగరంలో వైకాపా నాయకులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి.

 

బెజవాడ నగర మేయర్ కార్పొరేషన్ స్థానం ఎలాగైనా కైవసం చేసుకోవడం కోసం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంకొంతమంది వైసిపి నాయకులు చేస్తున్న రాజకీయాలకు ఎక్కడికక్కడ తన రాజకీయ ఎత్తుగడలతో కేశినేని నాని అడ్డుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. సాధారణంగా విజయవాడలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంటుంది. ఇటువంటి తరుణంలో నగరంలో ఉన్న చాలా వార్డులలో కేశినేని నాని ఇప్పటికే ఉన్న అభ్యర్థులను తనవైపు తిప్పుకుని విజయవాడ నగర మేయర్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అంకితం చేయాలని ఎక్కడికక్కడ పగడ్బంధీ వ్యూహాలతో రాజకీయ ఎత్తుగడలతో దూసుకుపోతున్నరట.

 

మరోపక్క మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇమేజ్ కేశినేని నాని కంటే కొద్దిగా డౌన్ కావటంతో… ఆయన ఎత్తుగడలు పనిచేయటం లేదు అని వార్తలు అందుతున్నాయి. ఇదే టైములో కేశినేని నాని విజయవాడ నగర మేయర్ గా కుమార్తె శ్వేతా ని రంగంలోకి దింపి… కరోనా వైరస్ సమయంలో ఇంకా కొన్ని కీలక సమయాలలో విజయవాడలో చాలా చురుగ్గా ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ బట్టి విజయవాడ నగర మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని వార్తలు అందుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: