గత సార్వత్రిక ఎన్నికల టైంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు కే ఏ పాల్. కానీ ఎన్నికల ప్రచారంలో కే ఏ పాల్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తనతో కలిసి పోటీ చేయాలని .. ఇద్దరి కాంబినేషన్ బాగుంటుంది అంటూ ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వం సాధిస్తుందని చాలా సీరియస్ గా ఆయన వ్యాఖ్యలు చేసినా గాని, ఏపీ ప్రజలు ఆయన చేసిన వ్యాఖ్యలు హడావిడికి తెగ నవ్వుకున్నారు. ఓడిపోయిన తర్వాత అమెరికాకి వెళ్లిపోయిన కెఏ పాల్… కరోనా వైరస్ సమయం లో అక్కడి నుండి ఇంటర్వ్యూలు ఇస్తూ చైనాపై ఎవరూ ఊహించని కామెంట్లు చేశాడు.

 

ఆయన వ్యాఖ్యలు విని చాలా మంది పాల్ కి అంతర్జాతీయ స్థాయిలో మంచి పట్టు ఉందని అవగాహనకి వచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల చైనా మరియు భారత సరిహద్దుల్లో 20 మంది భారత ఆర్మీ జవాన్లను చైనా దేశం ఉద్దేశపూర్వకంగా చంపారని కెఏ పాల్ తీవ్రస్థాయిలో ఖండించారు. చైనా దేశం ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించటానికి… ఆడుతున్న డ్రామా అని అభివర్ణించారు.

 

చైనా దేశానికి కంట్రోల్ చేయటం ప్రస్తుతం అమెరికా వల్ల కూడా కాదని… అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మీడియా ముందు చైనా పై వ్యాఖ్యలు చేస్తున్నా గాని తెర వెనకాల చైనాతో వ్యాపారం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచం మీద ఆధిపత్యం చెయ్యాలని సూపర్ పవర్ కంట్రీ గా ఎదగాలని… పైకి శాంతి మంత్రం జపిస్తున్న చైనా కి ప్రస్తుతం యుద్ధమే ముఖ్యమని తేల్చేశారు. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలోనే తాను ముందే చెప్పానని, వుహాన్ ల్యాబ్ నుంచి చైనా ఉద్దేశ్యపూర్వకంగానే వైరస్ ను  బయటకు పంపించింద‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు పాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: