కరోనా ప్రభావం అన్ని రంగాలపైనా ఉంది.. ప్రత్యేకించి ప్రింట్ మీడియా కరోనా దెబ్బతో విలవిల్లాడుతోంది. ఇది పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబును దారుణంగా దెబ్బ తీస్తోంది. అదేంటి.. కరోనాతో చంద్రబాబుకు దెబ్బ ఏంటి.. అది కూడా ప్రింట్ మీడియాకు దెబ్బ అయితే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు కథ.

 

 

చంద్రబాబు బలం అంతా మీడియా మేనేజ్ మెంట్‌లోనే ఉంటుందన్నది బహిరంగ సత్యం. ఆయనకు మీడియా బలం అంతా ఇంతా కాదు.. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ మీడియా బలం కాస్త తగ్గినమాట వాస్తవమే కానీ.. ఇప్పటికీ ఆయన మీడియాను అద్భుతంగా వాడుకుంటారన్న పేరు మీడియా సర్కిళ్లలోఉంది. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ లో ఇంకా ఆయన మీడియా పరంగా చాలా బలంగా ఉన్నారనే చెప్పాలి.

 

 

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ప్రధానంగా మూడు పెద్ద పత్రికలే. వాటిలో ఒక్క సాక్షి మీడియా తప్ప మిగిలినవన్నీ చంద్రబాబు అంటే వల్లమాలిన ప్రేమ చూపిస్తాయన్న సంగతి మీడియా తీరుతెన్నులు తెలిసిన వారు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఇప్పుడు కరోనా ప్రభావంతో సదరు ప్రింట్ మీడియా దారుణంగా దెబ్బతింటోంది. లక్షలకు లక్షల కాపీల సర్క్యలేషన్ నానిటికీ పడిపోతోంది. మరోవైపు జనం డిజిటల్ మీడియాకు అలవాటు పడిపోతున్నారు.

 

 

అంటే మీడియాలో ప్రింట్ మీడియా ప్రభావం గణనీయంగా తగ్గబోతోంది. దీనివల్ల జగన్ సొంత పత్రిక సాక్షి కూడా ఇబ్బందిపడొచ్చు. కానీ దీనివల్ల జగన్ కు జరిగే నష్టం కంటే.. చంద్రబాబుకు జరిగే నష్టం చాలా ఎక్కువ. ఎందుకంటే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో వైసీపీ బాగానే దూకుడు చూపుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రింట్ మీడియా కష్టాల కారణంగా జగన్ కు ఒక కన్నుపోతే.. చంద్రబాబు కు రెండు కళ్లూ పోయే ప్రమాదం ఉందని కామెంట్ చేస్తున్నారు విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: