ప్రజలను పట్టి పీడిస్తున్న ఈ మాయదారి కరోనాతో బ్రతికున్న జనానికే కాదు చచ్చిన శవాలను కూడా ముప్పతిప్పలు పెడుతుంది. ఒకప్పుడు అంటరాని తనాన్ని రూపుమాపడానికి ఎందరో శ్రమించారు.ఇప్పుడు అదే అంటరానితనాన్ని పాటించి కరోనా నుండి కాపాడుకోండిరా అంటే ఎవరు వినడం లేదు.. అదిసరే కరోనా వల్ల మనిషికి కలిగే ఇబ్బందుల పట్ల అయినా అవగహన పెంచుకోండంటే.. ఒక క్వాటర్ మందు పీకితే కరోనానా, దాని అమ్మనా మనదగ్గరకు ఏది రాదని ఢాంభికాలు పలుకుతున్నారు.. ఇలా లోకమంతా తనను హేళన చేస్తున్న ఈ వైరస్ మాత్రం తనపని తాను క్రమశిక్షణతో చేసుకుంటు పోతుంది..

 

 

ఇప్పటికే కరోనాతో మరణించిన వారి పరిస్దితుల గురించి వార్తల్లో చాలా విన్నాము, వీడియోలు కూడా చూసాము.. విదేశాల్లో అయితే కరోనా శవాలను మరీ దారుణంగా పడవేసారు.. మనదేశంలో ఆ పరిస్దితి రావద్దని అనుకున్నాము కానీ ఇప్పుడు అక్కడ జరిగినట్లే ఇక్కడ కూడా జరిగేలా ఉంది.. ఎందుకంటే మనదేశంలో కూడా కరోనాతో మరణించిన శవాల అంతిమ యాత్రకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. అంతే కాకుండా వీరి అంతిమ సంస్కారాల నిర్వహణ పోలీసులకు, కుటుంబ సభ్యులకు, జీహెచ్‌ఎంసీ అధికారులకు సవాల్‌గా మారుతోంది. ఇకపోతే కరోనా సోకిన ఓ మహిళ కింగ్‌కోఠి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.. ఈవిడ అఫ్జల్‌గంజ్ నివాసి..

 

 

కాగా ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు నారాయణగూడ పోలీసులు దహన సంస్కారాలకు షాయినాత్‌గంజ్‌ శ్మశానానికి తీసుకెళ్లగా.. కరోనా రోగి కావడంతో అక్కడ అనుమతి లేదన్నారు. అదీగాక ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీలో సైతం భద్రపరిచేందుకు అనుమతి ఇవ్వలేదు.. చివరగా మృతురాలి కుటుంబ సభ్యులు జీహెచ్‌ఎంసీ అధికారులను సంప్రదించగా.. రాత్రి అయితే దహన సంస్కారాలు చేయడానికి అవకాశం ఉంటుందని తెలపడంతో, మృతదేహాన్ని అంత్యక్రియల వరకు ఎక్కడ ఉంచాలో అర్థం కాని బాధిత కుటుంబ సభ్యులు చివరకు ఫ్రీజర్‌ సౌకర్యం ఉన్న అంబులెన్స్‌ను పిలిపించి, గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు అందులోనే భద్రపరిచారట.

 

 

ఇక రాత్రి సమయంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం సహకారంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు నారాయణగూడ పోలీసులు వెల్లడించారు.. చూశారా కరోనా వల్ల బ్రతుకు ఎలా బజారు పాలవుతుందో.. అందుకే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆరోగ్యానికి మించిన ఆనందం లేదని గ్రహించండి.. ఈ వైరస్ నుండి రక్షించుకోండి..  

మరింత సమాచారం తెలుసుకోండి: