పశ్చిమ జర్మనీలోని  మాంసం ప్లాంటు సిబ్బందిలో 400మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ ప్లాంటులో 6000కుపైగా సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో స్థానికప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్నాయి. పశ్చిమ జర్మనీకి చెందిన ఓ మాంసం ప్యాకేజీ ప్లాంట్​లో కరోనా వైరస్​ కలకలం సృష్టించింది. ప్లాంటులోని 400మంది వైరస్​ బారినపడినట్టు గుటెర్​స్లో నగరానికి చెందిన ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

 

గత కొన్ని వారాలుగా జర్మనీ వ్యాప్తంగా ఉన్న ఈ తరహా ప్లాంట్లలో కరోనా వైరస్​ వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. ఫలితంగా వీటిపై ప్రభుత్వం అనేక ఆంక్షలను విధించింది. పరిశ్రమల్లో మరింత కఠిన నిబంధనలను అమలు చేసింది.వైరస్​ విజృంభించిన తాజా ప్లాంటులో 6వేలకుపైగా సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది.జర్మనీలో ఇప్పటివరకు 1,89,027 కరోనా కేసులు నమోదయ్యాయి. 8,918మంది ప్రాణాలు కోల్పోయారు.

 

జర్మన్‌ వ్యాధి, అంటువ్యాధుల సంస్థకు చెందిన రాబర్ట్‌ కోచ్‌ ద్వారా కరోనా నివారణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. పెద్దఎత్తున వ్యాధి నియంత్రణ (కంటెయిన్‌మెంట్‌) సమూహాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక చర్యలు తీసుకుంది. మార్చి 22న జాతీయ కర్ఫ్యూ విధించింది. అయిదు ఇరుగు పొరుగు దేశాలకు సరిహద్దులు మూసివేసింది. అత్యవసరాల కోసమే ప్రజలు బయటికి వెళ్లడానికి అనుమతించింది. జర్మనీలో 132 కేంద్రాల్లో వారానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు వైరస్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 13.5 లక్షల పరీక్షలు జరిగాయి. వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. టెలీ మెడిసన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

 

జర్మనీ వైద్యవిధానాలు ఎలా ఉన్నాయి: 

 

జర్మనీలో కరోనా నియంత్రణకు ప్రభుత్వ వైద్య విధానాలు, వ్యవస్థ ఎంతగానో దోహదపడ్డాయి. దేశం మొత్తం జనాభా 8కోట్లు కాగా. 16రాష్ట్రాలున్నాయి. విద్య, వైద్యరంగాలు పూర్తిగా ప్రభుత్వాధీనంలో ఉన్నాయి.విద్య, వైద్యరంగాలు పూర్తిగా ప్రభుత్వాధీనంలో ఉన్నాయి. ఏటా జర్మనీ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి వ్యక్తికి రూ.4.5 లక్షలను ఖర్చు చేస్తోంది. ఇది చాలా దేశాలకంటే ఎక్కువ. ఇక్కడ అందరికీతప్పనిసరి ఆరోగ్య బీమా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: