దేశంలో కరోనా వైరస్ విజృంభన రోజు రోజుకు ఎక్కువగా ఉంటుంది. కరోనా వైరస్ కారణంగా స్కూళ్లు కాలేజీలు, కోచింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ వంటివి అన్నీ మూత పడ్డాయి. దీంతో ఇప్పుడు చాలా మంది ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వ్యవస్థలోకి మారిపోతున్నారు. దీంతో ఆన్‌లైన్ క్లాసులకు డిమాండ్ బాగా పెరిగిందని చెప్పుకుంటున్నారు. దీంతో డబ్బు సంపాదించాలని భావించే వారికి ఒక మంచి ఆప్షన్ అందుబాటులోకి వచ్చిందన్నారు.

 

 

అయితే రోజుకు 3 గంటలు పని చేస్తే చాలు నెలకు రూ.40,000 సంపాదించొచ్చన్నారు. ఢిల్లీలో నేహా నారాంగ్ అనే మహిళ ఇప్పటికే ఈ మేరకు డబ్బు సంపాదిస్తున్నారు. పిల్లలకు 3 గంటలు ఆన్‌లైన్ పాఠాలు చెప్పడం, అలాగే టీచర్లకు 2 గంటలపాటు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఈమె డబ్బులు అర్జిస్తున్నారని సమాచారం.

 

 

అయితే ఈమె ఇంజినీరింగ్ పూర్తి చేశారు. పెళ్లి తర్వాత ఐటీ జాబ్ వదిలేశారు. అయితే ఇంట్లోనే ఖాళీగా కూర్చొవడం ఇష్టం లేక సొంతంగానే డబ్బులు సంపాదిస్తున్నారు. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో నేహా బయట ఉద్యోగాలు చేయడం మానేశారు.

 

 

కేజీ నుంచి 8వ తరగతి వరకు పిల్లలకు మ్యథ్స్ చెబుతున్నారు. దీని కోసం ఈమె ఒక కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీనిపేరు క్యూమ్యాథ్. దీనికి దేశవ్యాప్తంగా 3 వేలకు పైగా సెంటర్లు ఉన్నాయి. డబ్బు సంపాదించాలంటే ముందుగా ఈ కంపెనీలో మెంబర్ కావాల్సిందే అంటున్నారు.

 

 

దీని కోసం కంపెనీ వెబ్‌సైట్‌కు వెళ్లి టీచర్‌గా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మీకు టెస్ట్ ఉంటుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా చేస్తారు. ఎంపిక అయితే టీచర్ సభ్యత్వం లభిస్తుందన్నారు. దీనికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 10వ తరగతి వరకు మ్యాథ్స్ చెప్పగలగాలి. మీకు కంపెనీ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. దీనికి రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత రూమ్‌లో కూర్చొని పిల్లలకు పాఠాలు చెప్పొచ్చునాని తేలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: