సినిమా రంగం అనేది ఓ రంగుల ప్రపంచం అందులోకి ఎవరైనా ఒకసారి వెళ్తే మళ్లీ బయటికి తిరిగి రావడానికి చాలా ఇబ్బందులు పడతారు. అలాగే సినిమా కోసమని ముఖ్యంగా యువత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని ఏరికోరి కొంతమంది మోసగాళ్లు ఎంచుకుంటారు. అలా ఎంచుకుని వారిని ముగ్గులోకి దించుతారు కొందరు. మాయమాటలు చెప్పి సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామని ఆర్థికంగా, శారీరకంగా వారిని వాడుకొని వదిలేస్తారు. ఇలాంటి సంఘటనే ఒకటి వైజాగ్ లో చోటుచేసుకుంది.

 

 

కొత్త సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని ఓ యువతికి విశాఖపట్నం కి చెందిన గీతాలయ స్టూడియోస్ గీతా ప్రసాద్ గ్యాంగ్ ఎర వేశారు. కొత్తగా వచ్చే మిధునం సినిమా ద్వారా చాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఆమెకు ఆశ చూపించారు.  అందులో వచ్చే ఐటమ్ సాంగ్ లో నటించేందుకు ఆమెకు అవకాశం ఇస్తామని తెలియజేశారు. అంతేకాదు ఆమెకి 10 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇప్పిస్తామని వారు నమ్మబలికారు. దీంతో సదరు యువతి ఆనందంతో మురిసిపోయింది.

 

 

ఆ తర్వాత ప్రొడ్యూసర్ ఇచ్చే డబ్బులో తనకి 5 లక్షల కమిషన్ ఇవ్వాలని గీత ప్రసాద్ గారు బేరం పెట్టారు. ఇకపోతే షూటింగ్ జరగడానికి సినిమాకి బడ్జెట్ సరిపోలేదని సినిమా ఆగినందున డబ్బు అవసరం అని చెప్పి వారి మాటలు నమ్మి తన పేరుమీద ఉన్న ఆస్తిని రెండు దఫాలుగా తాకట్టు పెట్టి ఏకంగా 5 లక్షల రూపాయలు గీత ప్రసాద్ కు చెప్పింది. ఇంతవరకు బాగున్న సినిమా షూటింగ్ ఎంతకీ జరగక పోవడంతో తన డబ్బు కోసం యువతి వాళ్ళని నిలదీయగా... నీ డబ్బులు కావాలంటే చెప్పిన హోటల్ కి రావాలని అక్కడ తాము చెప్పినట్టు వ్యభిచారం చేయాలని యువతిపై ఒత్తిడి చేశారని ఆమె చెప్పుకొచ్చింది.

 


ఇక ఇదేంటి అని అడిగితే... వారు మాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసని విషయం బయటికి వస్తే చంపేస్తామని దౌర్జన్యం చేస్తున్నారని ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనలాగే మరో పదిమంది కూడా ఈ గీత ప్రసాద్ మోసం చేశాడని తెలిపింది. దీంతో ఆ కేసును వెస్ట్ ఏసిపి స్వరూపరాణి దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే గీత ప్రసాద్ గ్యాంగ్ పై పోలీసులు పలు రకాల కేసులను నమోదు చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: