ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ పరీక్షలు చేయడంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ చేయటంతో వస్తున్న ఫలితాలు బట్టి కేసులు సంఖ్య ఉన్న కొద్దీ పెరుగుతున్నాయి. దేశంలో మిగతా రాష్ట్రాలలో చాలా వరకు నిర్ధారణ పరీక్షలు సరిగా జరగక ముందే కేసులు భయంకరంగా బయటపడుతున్నాయి. ఇలా అయితే చాలా ప్రమాదకరమని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఈ విషయంలో ఏపీ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకంటే ముందు ఉండటం గమనార్హం.

 

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం ఒంగోలు జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 38 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా బయటపడ్డాయి. ఒంగోలు జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 267 కు చేరుకుంది. దీంతో  పరిస్థితి పూర్తిగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని వెంటనే జిల్లా కలెక్టర్ 14 రోజులపాటు ఒంగోలు నగరాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

 

దీంతో ఎల్లుండి నుండి ఒంగోలు నగరం లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. ఇప్పటివరకు ఒంగోలు జిల్లాలో 60000 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. దీనిలో  52,777 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 7,451 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 891 మంది క్వారంటైన్లలో ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారి నుండి 120 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, జిల్లాలో ప్రస్తుతం 147మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో మొదటి లో జీరో స్థాయికి పడిపోయిన పాజిటివ్ కేసులు ఇప్పుడు ఒకేసారి పెరగటంతో జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: