గ్రామస్తుల శ్రేయస్సు కోరే ఓ గ్రామ వాలంటీర్ కీచకుడిలా ప్రవర్తించాడు.. బంధుత్వాన్ని కలుపుకున్నాడు.. అక్కా అంటూ మాట్లాడుతూనే తన కామాన్ని ప్రదర్శించాడు. అతని దారుణానికి సోషల్ మీడియాని వాడుకున్నాడు. ఆమె ఫోటోలను ఎఫ్ బీలో పెట్టి రోజు వేధించడం మొదలు పెట్టాడు.  ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కప్పవరం గ్రామంలో చోటు చేసుకుంది. అతని వేధింపులు భరించలేక సదరు మహిళ భర్తకు విషయం తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అతని కీచక పర్వం మాత్రం ఆగలేదు.. పైగా నా పరువు తీస్తావా అంటూ మరింత రెచ్చిపోయాడు. అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన ఓ మహిళ, భర్త వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. దీంతో ఆమె తన పుట్టింటివారి ఊరైన కప్పవరంలో నివాసం ఉంటోంది.

 

అయితే ఆమె ఉంటున్న ఇంటి యజమాని కొడుకు, గ్రామ వాలంటీర్ అయిన దుర్గారెడ్డి అక్కా అని పిలిచేవాడు. దీంతో ఆమె అతన్ని తమ్ముడిలా భావించి మాట్లాడేది. కానీ అతను మాత్రం ఆమెను ఎలాగైనా అనుభవించాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. దానికి పక్కా ప్లాన్ ప్రకారం ఆమె పేరుపై ఎఫ్ బీ అకౌంట్ ఓపెన్ చేశారు. అంతులో కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టి ఆకర్షించడం మొదలు పెట్టాడు. చిన్నగా మహిళ ఫోటోలను ఎఫ్బీలో పెట్టి నిత్యం వేధించసాగాడు. తనకు లొంగిపోవాలని.. లేదంటే అసభ్యకరమైన ఫోటోలు షేర్ చేసి నీ పరువు తీస్తా అని బెదిరించడం మొదలు పెట్టాడు.

 

కానీ ఆమె మాత్రం ససేమిరా అనడం మొదలు పెట్టింది.  విసుగుచెందిన ఆమె పోలీసులను ఆశ్రయించగా.. ఫోటోలు డిలీట్ చేస్తానని చెప్పడు. దీంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు. అయితే నెల రోజులైనా ఫేస్‌బుక్‌లో ఫోటోలు తొలగించకపోవడంతో సదరు కీచకుడిని ని మహిళ నిలదీసింది. తన భర్త పిల్లలతో సహా తనను ఇంటి నుంచి పంపించాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: