దేశంలో కరోనా వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసిందే. మార్చి 24 నుంచి లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది తమ ఉపాది కోల్పోయారు.. ఇల్లు గడవడం కోసం ఉన్నత విద్య అభ్యసించిన వారు సైతం కూలీలుగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఇక మొన్నటి వరకు రవాణా వ్యవస్థ ఎలా ఉందో అందరికీ తెలిసిందే.  కరోనా వైరస్ తో చాలా మంది  ట్యాక్సీ, ఆటోల్లో ప్రయాణాలు తగ్గించుకున్నారు.

 

తాజాగా ట్యాక్సీ యజమానులు లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోయారని... వారి వాహనాలకు పర్మిట్ ఫీజులు, రోడ్ ట్యాక్సులు రద్దు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ట్యాక్సీ యజమానులను రోడ్ ట్యాక్స్, పర్మిట్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం సరికాదని చెప్పారు. ఇప్పుడు వాళ్లు బతకడమే చాలా కష్టంగా ఉంది మహాప్రభో అంటున్నారు. జన జీవనం స్తంభించడంతో, వాహనాలు తిప్పే పరిస్థితి లేదని... లాక్ డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత కూడా గతంలో మాదిరి ఆదాయం లేదని చెప్పారు.

 

  ఈ నేపథ్యంలో పన్నులు రద్దు చేయాలని... సీట్ల కుదింపు ఉన్నంత కాలం  50 శాతం రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్యాక్సీ యజమానులను, వారిపై ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.  మరోవైపు ఏపిలో కరోనా  కేసులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. అయితే కరోనా వల్ల ప్రజలు బయటకు రావడం చాలా వరకు తగ్గించుకున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: