జగన్ కి భారీ విజయాలే అన్నీ దక్కుతున్నాయి. ఆయన గత ఏడాది 151 సీట్లతో గట్టెక్కితే తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 152 రెండు ఓట్లు వచ్చాయి. అంటే జగన్ తన బలాన్ని ఓ వైపు పెంచుకువెళ్తున్నారు. మరో వైపు చూసుకుంటే టీడీపీ ఆరు ఓట్లు తగ్గించుకుని రాజ్యసభ ఎన్నికల్లో దారుణమైన ఫలితాన్ని చూసింది. మరి జగన్ ఇమేజ్ డ్యామేజ్ కావడం ఏంటి అన్న ప్రశ్న వస్తుంది.

 

జగన ఇమేజీ డామేజీ చేయడానికి కొందరు ప్రయత్నించారని,కాని తాము తిరిగి నిలబెడతామని ఆయన అన్నారు. అయితే జగన్ కి తలనొప్పిగా నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణంరాజు ఉన్న సంగతిని ద్రుష్టిలో ఉంచుకునే కొత్త ఎంపీ పరిమళ్ నత్వానీ ఈ కామెంట్స్ చేశారని భావిస్తున్నారు. నిజానికి పరిమళ్  నత్వాని ఏకంగా బీజేపీ పెద్దలకు డైరెక్ట్ గా టచ్ లో ఉంటారు. ఆయన గుజరాత్ నుంచి ఎదిగిన నేత. పారిశ్రామికవేత్త. మోడీ, అమిత్ షాలకు ఆయన చాలా సన్నిహితుడు అన్న పేరు ఉంది.

 

ఇవన్నీ ఇలా ఉంటే రాజ్యసభ ఎంపీగా గెలిచిన తరువాత పరిమళ్ నత్వానీ చేసిన కామెంట్స్ ఇపుడు చర్చగా ఉన్నాయి. జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేసారని, తాను మళ్ళీ జగన్ ప్రతిష్టను నిలబెడతానని, ఆ విధంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అంటే ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల పరిమళ్ నత్వాని బాగానే అవగాహనతో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.

 

ఇక ఏపీలోనూ వైసీపీ ఎంపీలోను ఉన్న వారి కంటే కూడా పరిమళ్ నత్వాని కేంద్రానికి దగ్గర కావడం మంచి పరిణామమే.  వైసీపీకి ఆయన ఈ విధంగా తన పలుకుబడి ఉపయోగించి సాయపడితే రేపటి రోజున ఏపీలో అన్ని కార్యక్రమాలూ సవ్యంగా సాగి జగన్ ఇమేజ్ కూడా భారీ ఎత్తున  పెరుగుతుంది అంటున్నారు. ఇక కేంద్రంతో ఏపీ సర్కార్ కి బోలెడు పని ఉంది. అందువల్ల రేపటి రోజున పరిమళ్ నత్వాని జగన్ పార్టీకి, కేంద్ర రాష్ట్రాలకు మధ్య సంధానకర్తగా ఉంటారని అంటున్నారు. చూడాలి మరి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: