మనిషి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది కరోనా వైరస్. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులపై ఉద్యోగస్తుల పై పేదవాడి పై పడటంతో జీవితాలు మొత్తం తలకిందులయ్యాయి. ఇదిలా ఉండగా కరోనా వైరస్ ప్రాథమిక లక్షణాలు 9 అని మొదటి లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది.  జ్వరం, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కఫము, కండరాల నొప్పి, ముక్కు కారడం, గొంతుమంట, విరేచనాలు, అనోస్మియా (వాసన లేమి), ఎగూసియా (రుచిని తెలుసుకోలేకపోవడం) వంటి లక్షణాలు ఉంటే కరోనా వైరస్ అని గుర్తించడం జరిగింది.

 

ఇదిలా ఉండగా తాజాగా కరోనా వైరస్ విషయంలో కొత్త లక్షణం చేర్చబడింది. అది ఏమిటంటే కండ్లకలక ద్వారా కూడా కరోనా వైరస్ సోకుతుందని పరిశోధకులు గుర్తించారు. కెనడా దేశానికి చెందిన ప్రముఖ యూనివర్సిటీ ఈ కథనాన్ని ప్రచురించింది. పూర్తి వివరాల్లోకి టోరంటో లో గత మార్చి నెలలో ఓ 29 ఏళ్ల మహిళ తీవ్రమైన కళ్లకలక సమస్యతో రాయల్ అలెక్సాండ్రా ఆస్పత్రికి చెందిన ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అల్బెర్టాకి వచ్చింది. కళ్లకలకతో పాటు ఆమెకు కొద్దిమేర ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. చికిత్స అందించారు. అయినా కానీ ఆమె బాగుపడలేదు.

 

దీంతో వైద్యులు అనుమానం వచ్చి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష చేయించగా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కరోనా వైరస్ ప్రధాన లక్షణాల్లో శ్వాసకోస అంతగా ఏమీ లేదు. ప్రధాన లక్షణంగా కళ్లకలకే ఉండటంతో వైద్యులు షాక్ అయిపోయారు. కనీసం జ్వరం మరియు దగ్గు లాంటి లక్షణాలు కూడా ఏమీ కనిపించకపోవడంతో… కళ్లకలక ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది కెనడియన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీకి చెందిన పరిశోధకులు స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: