గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసు వివరాలను కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ ద్వారా వివరాలను తెలియజేసింది. వివరాల్లోకి వెళితే నేడు ఒక్క రోజు 337 కేసులు కొత్తగా నమోదయ్యాయని తెలపడం జరిగింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 8281 కు చేరుకున్నాయి. ఇక మరోవైపు నేడు ఒక్కరోజే 230 మంది కరోనా నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఈ సంఖ్యతో రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు 5210 మంది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది.

 

 


ఇక మరోవైపు నేడు ఒక్కరోజే రాష్ట్రంలో కరోనా కారణంగా పది మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 126 మంది కరోనా బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2943 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇందులో 78 మందికి సీరియస్ గా ఉండటంతో ఐసీయూలో ఉండి చికిత్సను అందజేస్తున్నారు. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన 11 మందికి నేడు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 93 మందికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగిందని తెలియజేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కంటే ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్లనే కరోనా ఎక్కువగా సోకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: