ప్రస్తుతం కరోనా  వైరస్ భారతదేశంలో శర వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. కరోనా పంజాకి  భారత ప్రజానీకం మొత్తం విలవిల్లాడిపోతోంది. ఈ నేపథ్యంలో ఎంతో మంది ప్రజల జీవితం అతలాకుతలం అయిపోతుంది. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ తోనే  ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంభయంగా బతుకుతూ ఉంటే.. మనుషుల ప్రాణాలు తీయడానికి కొత్త వైరస్ లు వస్తే ఇక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. ప్రస్తుతం అడవులను నరికి వేస్తూ వన్యప్రాణులను పట్టించుకోకపోవడం కారణంగా.. కొత్త కొత్త వైరస్ వ్యాపించే అవకాశం ఉందని.. అంతర్జాతీయంగా ఒక చర్చ ప్రారంభమైంది. 

 


 వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనేటువంటి సంస్థ.. ప్రస్తుతం ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసాన్ని ఆపకుంటే వన్యప్రాణుల కి హాని తలపెడితే.. భవిష్యత్తులో  మనుషులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు అంటూ హెచ్చరిస్తుంది. ప్రాణాంతకమైన వ్యాధులు వైరస్లు చెలరేగి పోవడం ఖాయం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 1990 నుంచి మనుషుల్లో బయటపడిన కొత్త వ్యాధులు దాదాపుగా 70 శాతం వన్యప్రాణుల నుంచి వచ్చినవే.. అంటూ తాజాగా ఈ సంస్థ గుర్తు చేస్తుంది. 

 


 అంతేకాకుండా గత కొన్నేళ్ల నుంచి 178 మిలియన్ హెక్టార్ల అడవి కనుమరుగైపోయింది అంటూ ఈ సంస్థ వెల్లడించింది. దీన్నిబట్టి అడవులు అడవి జంతువులు వ్యాధుల  మధ్య ఉన్న సంబంధాన్ని మానవాళి మొత్తం గుర్తుంచుకోవాలంటూ  హెచ్చరిస్తోంది. ప్రస్తుతం చాలా వరకు వైరస్లు జంతువులు వన్యప్రాణి చంపుతున్నారు. వైరస్ లు జంతువుల శరీరంలో ఉన్నంత వరకు ఎలాంటి ప్రమాదం లేదని.. కానీ వాటిని చంపి తినడం కారణంగా మనుషులకు ఆ వైరస్ సోకి  వ్యాప్తి చెందుతున్నది  అని తెలిపింది . అందుకే వన్యప్రాణులను ఆహారంగా తీసుకోవడం తగ్గించాలి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: