టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి పరువు పొగొట్టుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేసినా గెలిచే అవకాశం లేదు. ఈ విషయం తెలిసిందే. అయినా చంద్రబాబు తన పార్టీని పోటీకి దింపారు. తన పార్టీ తరపున వర్ల రామయ్యను బరిలో దింపారు. తనకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు తన పార్టీకి ఒక్క సీటు కూడా గెలవదని చంద్రబాబుకు తెలుసు. అయినా సరే పోటీకి దింపారు.

 

 

వాస్తవానికి గెలుపుఓటములతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీ అన్నాక పోటీ చేయాల్సిందే. దాన్ని ఎవరూ కాదనరు. కానీ.. ఏమాత్రం గెలుపు అవకాశం లేకపోయినా పోటీ పేరుతో హడావిడి చేయడం రాజకీయంగా అభాసుపాలవడమే అన్న సంగతి తెలిసీ చంద్రబాబు రిస్కు చేశారు. పోనీ.. అది రాజకీయ పార్టీగా అనివార్యం అనుకుందామనుకున్నా.. విప్ జారీ చేసి ఇంకో తప్పుచేశారనే చెప్పాలి.

 

 

పోటీకి దిగడం వల్ల చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటి అంటారా.. తన పార్టీ బలం ఎంత తగ్గిందో ప్రజలకు చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో గెలిచిందే కేవలం 23 మంది. 23 మందిలో ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరామ్ వంటి వారు పార్టీకి దూరమయ్యారు. అంటే మూడు ఓట్లు ఫట్.. అంటే టీడీపీ బలం 20కు పడిపోయిందన్నమాట.

 

 

అంతేనా.. మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఈ ఎన్నికలకు హాజరు కాలేదు. అదేమంటే.. తాను క్వారంటైన్ లో ఉన్నానని పార్టీ అధినేతకు సమాచారం ఇచ్చానంటున్నారు. కానీ ఆయన కూడా త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోవచ్చన్న పుకార్లు చాలా రోజుల నుంచే వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అంటే టీడీపీ బలం 20 కంటే తగ్గిన సంగతి చంద్రబాబే డప్పు కొట్టి మరీ చెప్పినట్టు అయ్యిందన్నమాట.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: