ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. వైసీపీ అభ్యర్ధులు నలుగురు విజయం సాధించారు. ఒక్కొక్కరికి 38 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య కు కేవలం 17ఓట్లు మాత్రమే వచ్చాయి. కనీసం పరువు కూడా దక్కలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఓట్లు కూడా పూర్తి స్థాయిలో పోల్ కాలేదు.

 

 

టీడీపీకి చెందిన ఓట్లు నాలుగు చెల్లకపోవడం విశేషం. ఇందులో ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరితో పాటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పొరపాటు కారణంగా ఆమె ఓటు కూడా చెల్లలేదు. మొత్తానికి వైసీపీకి చెందిన అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని గెలిచారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీకే ఓటేశారు.

 

 

ఈ ఎన్నికల్లో పోటీ ద్వారా చంద్రబాబు తాను ఎస్సీలకు అన్యాయం చేస్తానని మరోసారి రుజువు చేసుకున్నట్టైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఓడిపోతారని కచ్చితంగా తెలిసినందు వల్లే ఈ టికెట్ చంద్రబాబు వర్ల రామయ్య వంటి దళిత నేతకు ఇచ్చారు. వర్ల రామయ్య కూడా పోనీలే.. ఇంకోసారికి ఈ సానుభూతి పనికొస్తుంది కదా అనుకున్నారో ఏమో బరిలోదిగారు.

 

 

కానీ.. వర్ల రామయ్య పేరు గతంలోనూ చంద్రబాబు రాజ్యసభకు ఓ సారి ప్రతిపాదించారు. అంతా సెట్ అయ్యి నామినేషన్ వేసేందుకు కూడా వర్ల రామయ్య బయలు దేరిన తర్వాత చంద్రబాబు ఆ టికెట్ కోటీశ్వరులకు ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో వర్ల రామయ్య దారిలోనే వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటికే ఆయన పేరు టీడీపీ అభ్యర్థిగా మీడియాలో ప్రముఖంగా వచ్చేసింది కూడా. అయినా సరే.. అప్పట్లో గెలిచే అవకాశం ఉండటం వల్ల టీజీ వెంకటేశ్, కనకమేడల వంటి ధనవంతులకు, అగ్రకులాలకే ఇచ్చుకున్నారు. దీన్నే చంద్రనీతి అంటారని దళిత నాయకులు విమర్శిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: