ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడంతో రాజ్యసభలో వైసీపీ సంఖ్యా బలం ఆరు కి పెరిగింది. వైసీపీ పార్టీ తరఫున రాజ్యసభకి పోటీకి దిగిన నలుగురు అభ్యర్థులు  పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. ఇదే సమయంలో టీడీపీ పార్టీ తరపున పోటీకి దిగిన వర్ల రామయ్య ఓటమి చెందారు. ప్రతి అభ్యర్థికి 38 ఓట్లు చొప్పున పడటంతో వైసిపి సంఖ్యా బలం 151 ఉండటంతో గెలుపు నల్లేరు మీద నడక లాగా వైసీపీ కి వరించింది.

IHG

ఇదిలా ఉండగా జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి జగన్ కి జై కొట్టారు అని టాక్. గతంలో వైయస్ జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలను అసెంబ్లీలోనే బహిరంగంగా పొగిడిన రాపాక వరప్రసాద్ తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికలలో  వైకాపా అభ్యర్థికి ఓటు వేసినట్లు సమాచారం. దీంతో నలుగురు వైసీపీ అభ్యర్థులకు 38 చొప్పున ప్రాధాన్యత ఓట్లు లభించాయి.

IHG

తెదేపా అభ్యర్థి అయిన వర్ల రామయ్యకు 17 ఓట్లు మాత్రమే దక్కాయి. టీడీపీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల ఓట్లు చెల్లలేదు. మొత్తం 175 శాసనసభ్యులలో ఎమ్మెల్యే అచ్చం నాయుడు మరియు అనగాని సత్యప్రసాద్ ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు  కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాళి గిరిధర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టీడీపీ  విప్ జారీచేయడంతో... ముగ్గురు టీడీపీ రెబల్‌ అభ్యర్థులు ఒకటి అంకె వేయాల్సిన చోటు అడ్డగీత పెట్టడంతో వారి ఓట్లు చెల్లకుండా పోయాయి. ఆది రెడ్డి భవాని వేసిన ఓటు కూడా లెక్కలోకి రాకుండా పోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: