ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏడాది పరిపాలనపై ప్రతి దినం ప్రజాహితం అనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు వైయస్ విజయమ్మ. నేను ఉన్నాను నేను విన్నాను అని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 90% హామీలను అమలు చేశారని ఈ కార్యక్రమంలో కొనియాడారు. మేనిఫెస్టో ని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావిస్తూ హరిత ఆంధ్ర దిశగా తీసుకెళ్లాలని సీఎం కృషి చేస్తున్నారని ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి నాడు జూలై 8 వ తారీకు ఇళ్ల పట్టాల కార్యక్రమం కూడా పూర్తి చేయనున్నట్లు వైయస్ విజయమ్మ చెప్పుకొచ్చారు.

IHG'Prati Dinam Praja Hitam' Book

ఈ కార్యక్రమం లో పుస్తక రచయిత రాజశేఖర్ తో పాటు ఏపీ జాతీయ మీడియా సలహాదారుగా దేవులపల్లి అమర్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పుస్తకంలో సంక్షేమ కార్యక్రమాలు శాఖల వారీగా సమీక్ష సమావేశాలు పర్యటనలు పొందుపరిచినట్లు దేవులపల్లి అమర్ తెలిపారు. ఈ సందర్భంగా దేవులపల్లి అమర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అని మొదటిలో అన్నాడు. ఆ విధంగానే జగన్ నిరూపించుకున్నారని చెప్పుకొచ్చారు.

IHG' <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YS JAGAN MOHAN REDDY' target='_blank' title='jagan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jagan</a> enters national <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=POLITICS' target='_blank' title='politics-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>politics</a> with PK formula

అదేవిధంగా పాదయాత్ర చేస్తున్న సమయంలో తన తండ్రి ఫోటో ప్రతి ఇంటిలో ఏ విధంగా ఉందో… ఆ విధంగా తన ఫోటో ఉండేలా పరిపాలన ఉంటుందని తన తండ్రి మాదిరిగానే పని చేస్తానని మాట ఇచ్చారు. ఆ విధంగా అధికారంలోకి వచ్చాక ఇప్పుడు జగన్ పనిచేస్తున్నారని అమర్ కొనియాడారు. సాధారణంగా అధికారంలోకి వచ్చాక మొదట మూడు సంవత్సరాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు.. సరిగ్గా ఎన్నికలకు ముందు అంతకు ముందు చెప్పిన ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ఉంటారు. కానీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను 90% అమలు చేశారు.. అది ప్రజలపై మరియు తనకు ఇచ్చిన బాధ్యత పై ఉన్న చిత్తశుద్ధి అన్నట్టుగా జగన్ వ్యవహరించినట్లు అమర్ చెప్పుకొచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: