తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తుంది. టెస్టుల సంఖ్య ఎక్కువతుంటే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూపోతుంది. నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 499 కేసులు నమోదయ్యాయి. ఇందులో  ఒక్క జిహెచ్ఎంసిలోనే 329కేసులు నమోదు కాగా రంగారెడ్డి లో 129 కేసులు నమోదయ్యాయి. వీటి తరువాత జనగామలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కొత్తగా 7పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇటీవల జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తో సహా అతని భార్య , వంటమనిషి , డ్రైవర్ , గన్ మెన్ లు కరోనా బారిన పడగా ప్రస్తుతం వీరు చికిత్స తీసుకుంటున్నారు. 
 
ఇక నిన్నటెస్టుల సంఖ్య కూడా పెరిగింది. నిన్న ఒక్కరోజే మొత్తం 2477 శాంపిల్ టెస్టులు జరిగాయి. ఈ కొత్త కేసుల తో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 6526 కరోనా కేసులు నమోదవ్వగా అందులో 3352మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2976కేసులు యాక్టీవ్ గా వున్నాయి. నిన్న కరోనా తో ముగ్గురు  మరణించడం తో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 198కు చేరింది.
 
ఇదిలావుంటే నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 14000 కేసులునమోదయ్యాయి. కాగా  దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 394000కు చేరగా 12800మరణాలు చోటుచేసుకున్నాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: