తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో అందరికి తెలిసిందే. ఎటువంటి విపత్కర పరిస్థితులను అయినా సమర్థవంతంగా ఎదుర్కొని, తిప్పి కొట్టగల సమర్థుడు కేసీఆర్. తెలంగాణలో ఎదురే లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా సెంటిమెంట్ రాజకీయంగా వాడుకునే విషయంలోనూ కేసీఆర్ సిద్ధహస్తుడు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించకముందే కరోనా వైరస్ ప్రభావం కేసీఆర్ ముందుగానే అంచనా వేయగలిగారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా ముందుగానే కట్టడి చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు అనే పేరు తెచ్చుకున్నారు. అలాగే కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలు కేంద్రం తో సంబంధం లేకుండా, మరికొద్ది రోజులు పెంచుకుంటూ వచ్చారు. ఎక్కడా లేనివిధంగా కఠినమైన నిబంధనలు విధించారు.


 ఇన్ని చేసినా, తెలంగాణలో ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగినట్టుగా కనిపించకపోగా, రోజు రోజుకు ఆందోళనకర స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో నిన్న ఒక్క రోజులోనే 302 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 90 శాతం పైగా కేసులు హైదరాబాద్ సిటీలోనే చోటుచసుకుంటున్నాయి. కాకపోతే రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షలు ఎక్కువగా చేస్తున్న కారణంగానే కొత్త కేసులు నమోదు అవుతున్నాయని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా తెలంగాణ లో నమోదైన కేసుల సంఖ్య 6027 ఉండగా, ఇప్పటి వరకు 3301 మంది డిశ్చార్జ్ అయ్యారు. 


మొత్తంగా 2531  యాక్టివ్ కేసులు ఉన్నాయి . ఇప్పటి వరకు 195 మంది ఈ కరోనా వైరస్ ప్రభావం తో మరణించారు. తెలంగాణ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అందరిలోనూ టెన్షన్ పెరుగుతోంది. ఈ సమయంలో కెసిఆర్ రంగంలోకి దిగి పరిస్థితికి చెక్ పెట్టకపోతే ఈ వైరస్ తెలంగాణాలో మరింత విజృంభిస్తోందని కెసిఆర్ ఈ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుని, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: