సాధారణంగా మన కళ్లు ఎర్రబడుతుంటాయి. అది కామన్ విషయం. కళ్లలో దుమ్ము పడినప్పుడు, దూళి పడినప్పుడు, లేదా శరీరంలో వేడి ఎక్కువ అయినప్పుడు కళ్లు ఎర్రబడటం కామన్ విషయం. కానీ ఇప్పుడు ఈ కరోనా కాలంలో కళ్లు ఎర్రబడటం కూడా కరోనా వైరస్ సంకేతమే అని అంటున్నారు కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కార్లోస్‌ సోలర్టె. 

 

IHG

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇన్నాళ్లు కరోనా వైరస్ లక్షణాలు కేవలం దగ్గు, జ్వరం, శ్వాస తీసువడం వల్ల మాత్రం ఇబ్బంది పడ్డారు అని.. అయితే ఇప్పుడు కళ్లు ఎర్రబారడం కూడా కరోనా వైరస్ సోకింది అనేందుకు సంకేతమే అని అంటున్నారు. కళ్ల సమస్యతో వారి వద్దకు ఓ మహిళ వచ్చింది అని అయితే అది మొదట కంటి సమస్యని అనుకున్నారు అని.. కానీ చివరికి కరోనా వైరస్ అని నిర్దారణ అయ్యింది అని అయన చెప్పుకొచ్చారు. 

 

IHG

 

ఇంకా కరోనా వైరస్ సోకినా వ్యక్తుల్లో 10 -15% మందికి సెకండరీ లక్షణంగా కండ్ల కలక, కళ్లు ఎర్రబడటం జరుగుతోంది అని అన్నారు. ఈ సమస్యలతో వచ్చేవారికి నేత్ర వైద్యులు కరోనా వైరస్‌ పరీక్షలు చెయ్యాలి అని సూచించారు. కాగా కరోనా వైరస్ ప్రస్తుతం భారత దేశంలో విలయతాండవం చేస్తుంది. కేవలం అంటే కేవలం ఒక్క రోజులో కొన్ని వేల కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు కరోనా వైరస్ పెరుగుతున్న నేపధ్యంలోను దేశంలో లాక్ డౌన్ ఎత్తివేయడం సాధారణమైన విషయం కాదు.              

మరింత సమాచారం తెలుసుకోండి: