భారత్-చైనా సరిహద్దు లో నెలకొన్న పరిస్థితులపై గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసింది. ఇక మొన్నటికి మొన్న ఏకంగా భారత సైనికులు 20 మంది అమరులవ్వడంపై కూడా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం పై ఎన్నో ఆరోపణలు చేశారు. దేశ ప్రజలందరూ సైనికులు ఎలా చనిపోయారు అని ప్రశ్నిస్తున్నారని వారందరికీ కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ. ఈ క్రమంలోనే తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. 

 

 అయితే తాజాగా రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా... రాహుల్ గాంధీకి ఇదే నా సమాధానం అంటూ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఒక సైనికుడు తండ్రి మాట్లాడిన మాటలను రాహుల్ గాంధీ కి సమాధానంగా పెట్టారు  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. దేశ భద్రత విషయంలో రాజకీయాలు చేయొద్దని రాహుల్ గాంధీని  ఈ సందర్భంగా అమిత్ షా  కోరారు. 

 


 ఇక ఈ వీడియోలో ఒక సైనికుడి తండ్రి రాహుల్ గాంధీకి చాలా స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు అని చెప్పాలి. ప్రస్తుతం భారత్కు చెందిన 20 మంది సైనికులు అమరులైన వేల దేశం మొత్తం ఒక్క తాటి పై నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తుచ్ఛమైన రాజకీయాలను పక్కనబెట్టి... జాతి ప్రయోజనాల కోసం దేశ అభ్యున్నతి కోసం నిలబడాలి అంటూ... ట్విట్ చేశారు. ప్రస్తుతం అమిత్ షా  పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. రాహుల్ గాంధీకి సరైన సమాధానం చెప్పారు అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. మరి దీనిపై రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: