దేశంలో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు తన రోజును పెంచుకుంటూ వెళ్తుంది. దేశంలో కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. లాక్ డౌన్ విధించడం వలన చాల మంది ప్రజలు జినోపాధి కోల్పోయారు. వారికీ అండగా నిలిచేందుకు  కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.

 

 

కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకోబోతోందన్నారు. ఉచిత రేషన్ అందించే స్కీమ్‌ను మరో మూడు నెలలు పొడిగించాలని పది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయన్నారు. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ విషయాన్ని తెలిజేశారు.

 

 

అయితే మీటింగ్‌లో చాలా రాష్ట్రాలు ఉచిత రేషన్ అందించే స్కీమ్‌ను మరి కొంత కాలం కొనసాగించాలని కోరాయని రామ్ విలాస్ పాశ్వాన్ తెలియజేశారు. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్నారు. రాష్ట్రాల అభ్యర్థనలను పీఎంవో ఆఫీస్‌కు పంపించామని రామ్ విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తుందన్నారు.

 

 

అయితే ఇప్పటి వరకు పది రాష్ట్రాలు ఉచిత రేషన్ స్కీమ్‌ను పొడిగించాలని లిఖిత పూర్వకంగా కోరాయని రామ్ విలాస్ పాశ్వాన్ వెల్లడించారు. అస్సాం, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, రాజస్తాన్ వంటి పలు రాష్ట్రాలు లేఖ రాశాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే.

 

 

అయితే మోదీ సర్కార్ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన తర్వాత గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్‌ను ప్రకటించింది. ఈ స్కీమ్ కింద రేషన్ కార్డు కలిగిన వారికి ఉచితంగా రేషన్ అందిస్తామని తెలిపారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ కింద కేంద్రం 81 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనాన్ని అందిస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: