ఎవరైనా సరే.. కరోనా భాదితుల దగ్గరకు వెళ్తున్నారు అంటే పిపిటి కిట్లు.. శానిటైజెర్లు పూసుకొని, మాస్కులు వేసుకొని వెళ్తారు.. కానీ ఆ సాంప్రదాయ స్త్రీలు మాత్రం కేవలం మాస్కుతో శానిటైజర్ లేకుండానే ఎంతో దైర్యంగా సేవలు అందిస్తున్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళకు అంత దైర్యం ఎలా వచ్చింది అని అనుకుంటున్నారు కదా! 

 

IHG

 

వాళ్ళకు ఎందుకు దైర్యం ఉండదు.. వాళ్ళు రోబోట్ లు. ఇప్పుడు అర్థం అయ్యిందా? అంత దైర్యం ఎందుకో ? వాళ్ళు స్త్రీలే కానీ మనుషులు కాదు. చీరకట్టిన అందమైన రోబోలు. అవును భారతీయ స్త్రీలా చీర కట్టి హెల్త్ వర్కర్లు తరహాలో తెల్లసూట్ కూడా వేసుకున్నాయి. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న షాకింగ్ గా ఉన్నాయి. 

 

IHG

 

కరోనా వైరస్ బాధితులకు సేవలు అందిస్తున్న ఈ రోబోలను ఓ రెస్టారెంట్ యజమాని అందించారు. గౌహతీలో రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఎస్ఎన్ ఫరీద్.. ఏడాదిన్నరగా తమ కస్టమర్లకు రోబోట్ల ద్వారా ఆహారం, పానీయాలు అందించేవారు. అయితే ఇప్పుడు ఆ రోబోట్లనే కరోనా వైరస్ బాధితులకు సేవలు అందించేందుకు అందిచారు.  

 

IHG

 

ఇన్నాళ్లు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న హెల్త్ వర్కర్లకు సాయం చేసేందుకు వీటిని అందించారు. ఈ రోబోట్ల సాయంతో వైద్యులు బాధితుల వద్దకు వెళ్లకుండానే వేరే చోట కుర్చొని కరోనా బాధితులతో మాట్లాడగలుగుతున్నారు. ఈ రోబోట్లు ఆహారం, మందులు కూడా అందిస్తున్నాయి. రోబోట్లు అందిస్తున్న సేవలను వీడియో తీసి కొందరు షేర్ చెయ్యగా.. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో ఏంటో మీరు కూడా ఓసారి చూసేయండి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: