తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ సామాజికవర్గానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిదనే సంగతి తెలిసిందే. ఆవిర్భావం నుంచి  టీడీపీలో కమ్మ సామాజికవర్గం నేతల డామినేషన్ కొనసాగుతూ వస్తుంది. అసలు 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో 11 మంది కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీని బట్టే ఆ పార్టీలో కమ్మ వారి ప్రభావం ఎంత ఉందో అర్ధమైపోతుంది.

 

అయితే టీడీపీని వీక్ చేయాలంటే కమ్మ సామాజికవర్గ నేతలనీ తమ పార్టీలోకి తీసుకొచ్చేయాలనే ఉద్దేశంతో జగన్..టీడీపీలో కీలకమైన వల్లభనేని వంశీ, కరణం బలరామ్‌లని తనవైపుకు తిప్పుకున్నారు. అలాగే ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌లని కూడా లాగాలని చూశారు. అందుకు తగ్గట్టుగానే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లాబీయింగ్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి షాక్ ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది.

 

ఒకానొక దశలో ఏలూరి పార్టీ మార్పు ఖాయమని టీడీపీ అనుకూల మీడియాలోనే వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఏలూరి సైలెంట్ గానే ఉన్నారు. కానీ సడన్ గా ఒకరోజు బయటకొచ్చి పార్టీ మారడం లేదని చెప్పారు. అయితే ఏలూరి ఇలా నిర్ణయం మార్చుకోవడానికి కారణం, ఆయనకు వచ్చిన హామీనే అని అర్ధమైంది. టీడీపీ అధినాయకత్వం...ఏలూరికి భవిష్యత్‌లో రాష్ట్ర స్థాయి పదవి, తర్వాత అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతోనే ఏలూరి పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగుతున్నారు.

 

ఇదే సమయంలో గొట్టిపాటి కూడా పార్టీ మారతారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన కూడా పార్టీ మారకుండా ఉన్నారు. కాకపోతే ఈయనకు ఏమి హామీ వచ్చిందో తెలియలేదు. అయితే ఏలూరికి మంత్రి పదవి హామీ ఇస్తే అదే సామాజికవర్గం, అదే జిల్లాకు చెందిన గొట్టిపాటికి మంత్రి పదవి హామీ ఇవ్వడం కష్టం. మరి గొట్టిపాటి పార్టీ మార్పు అనేది వాయిదా పడిందా? లేక టీడీపీలో కొనసాగడం ఖాయమా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: