ప్రస్తుతం రాహుల్ గాంధీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంపై పదే పదే విమర్శలు గుప్పిస్తూ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు రాహుల్ గాంధీ . అయితే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు నాయకుడైన రాహుల్ గాంధీ  విమర్శల నేపథ్యంలో ప్రస్తుతం రాహుల్ పూర్వీకులకు సంబంధించిన పలు అంశాలు తెర మీదికి వచ్చి చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాజీవ్ గాంధీ హయాంలో జరిగినటువంటి ఒక అంశం ప్రస్తుతం ప్రధానంగా చర్చకు వచ్చింది. 

 


 మోడీ  సర్కార్  అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి మూలుగుతూ వస్తున్న 370 ఆర్టికల్ రద్దు జరిగి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలాంటిదే అప్పట్లో రాజీవ్ గాంధీ హయాంలో కూడా జరిగింది. 1987లో.. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం.. కానీ ఆ సమయంలో చైనా అరుణాచల్ ప్రదేశ్ తమ దేశానికి చెందిన భూభాగం అంటూ వాదించింది. 1986లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సారథ్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. అరుణాచల్ ప్రదేశ్ కి రాష్ట్ర హోదా ఇచ్చింది. 

 


 ఈ నేపథ్యంలోనే చైనా ఎలాగైనా అరుణాచల్ ప్రదేశ్ ను  వివాదాస్పదంగా చేయాలని భావించింది.ఓ రోజు గస్తీ కాస్తున్నారు భారత సైనికులు కి సరిహద్దుల్లో చైనా గుడారాలు కనిపించగా.. వాటిని  పరిశీలిస్తే భారత భూభాగంలోకి చైనా వచ్చి తిష్ట వేసినట్లు అర్థమైంది భారత సైనికులకు. వెంటనే వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించగా అప్పుటి  ఆర్మీ జనరల్ కే సుందర్ ఉన్నారు. అప్పటికి భారత సైన్యం వర్సెస్  చైనా సైన్యం అన్నట్లుగా  ఎదురు ఎదురుగా  దాదాపు పది రోజుల పాటు ఉన్నారు. ఇక ఆ తర్వాత చైనా వెనక్కి తగ్గి సైన్యాన్ని వెనక్కి రావాలంటూ ఆదేశించారు. దీంతో ఒక గుండు కూడా పేలకుండానే వివాదం చల్లబడింది. ఇది భారత అతిపెద్ద విజయంగా భావిస్తారు రక్షణ రంగ నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: