2014 ఎన్నికల్లో టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా మంచి మెజారిటీ సీట్లు గెలుచుకుంది. అయితే చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను టిడిపి పార్టీలో చేర్చుకున్న  విషయం తెలిసిందే. రాజకీయంగా చూసుకుంటే ఇది నిజంగా దారుణమైన వ్యూహమే అని అంటున్నారు విశ్లేషకులు. ఇలా 23మంది ఎమ్మెల్యేలను ఆకర్షించడమే తప్పు... ఇక పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు చంద్రబాబు అది ఇంకా తప్పు. 

 


 ఇలా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో దారుణంగా వ్యవహరించిన  చంద్రబాబు ప్రస్తుతం పర్యవసానం అనుభవిస్తున్నారు అని అంటున్నారు పలువురు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వీలు లేకపోయినప్పటికీ.. టిడిపి పార్టీ నుంచి వైసీపీ కి మద్దతు చేస్తున్న నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతిరోజు చంద్రబాబుకు షాక్ తగులుతూనే ఉంది. ఇప్పటికే  టీడీపీ కీలక నేత వల్లభనేని వంశీ దేవినేని అవినాష్.. సహా పలువురు ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడి వైసీపీ మద్దతు తెలుపుతున్న విషయం తెలుస్తుంది

 

 ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా టీడీపీ నేతలు మరోసారి చంద్రబాబు పై ఉన్న తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజ్యసభ బ్యాలెట్ పై రాసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అన్ని దోచుకున్నారు దోచుకోవడానికి ఇంకేం మిగిలింది అంటూ ఒకరు... గెలిచే టప్పుడు ధనికులకు  ఓడిపోయినప్పుడు దళితులకా  అంటూ మరో బ్యాలెట్ పైన  కూడా రాసి ఉంది. వంశీ,  కరణం బలరాం, గిరి ఈ ముగ్గురిలో ఎవరు ఈ వ్యాఖ్యలు రాసి ఉంటారు అన్న చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: