కరోనా.. ప్రపంచాన్ని వణికిస్తున్న రోగం ఇది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు.. రోజూ వేల సంఖ్యలో మరణాలు.. ఇలా ఒకటి, రెండు కాదు ప్రపంచమంతా వణికిపోతున్నారు. అలాంటి కరోనాకు ఇండియా కట్టడి వేయబోతోంది. ఈ మహమ్మారికి మందు కనిపెట్టేసింది ఓ ఇండియన్ కంపెనీ. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ తాను కరోనాకు మందు కనిపెట్టానని ప్రకటించింది.

 

 

ఈ మందును ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ ప్రకటించింది. ఫాబిఫ్లూ బ్రాండ్‌ పేరుతో ఈ టాబ్లెట్లను మార్కెట్లోకి విడుదలచేయబోతోంది. గుడ్ న్యూస్ ఏంటంటే... ఈ మందును ఐసీఎంఆర్ కూడా ఓకే చెప్పేసింది. అమ్మకానికి అన్ని రకాల అనుమతులూ ఇచ్చేసింది.

 

 

ఇక ఈ మందు ఎలా వాడతారంటే.. కరోనా బారిన పడినవారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను మొదటి రోజు రెండు వేసుకోవాలి. ఆ ఇదే మందు 800 ఎంజీ డోసు టాబ్లెట్లు వరుసగా 14 రోజుల పాటు రోజుకు రెండుసార్లు చొప్పున వాడాల్సి ఉంటుంది. అయితే ఈ మందులను వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగానే అమ్ముతారు. ఎవరికి పడితే వారికి అమ్మరు.

 

 

ఈ మందు ధర చెప్పలేదు కదూ.. ఒక్కో మాత్ర రూ.103గా ఉంటుందట. కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై ఈ మందు బాగా పనిచేస్తోందట. అంటే కరోనా వచ్చిన వారు.. మొత్తం 30వరకూ టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. అంటే సుమారు రూ. 3000లతో కరోనా నుంచి బయటపడవచ్చన్నమాట. నిజంగా ఈ మందు పని చేస్తే.. ప్రపంచానికి కరోనా కష్టాలు తీరినట్టే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: