కరోనా  వైరస్ సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతం తరగతి పరీక్షల నిర్వహణ అయోమయం లో పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందడుగు వేసిన తెలంగాణ సర్కార్ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ అందరి విద్యార్థులను పాస్ చేసింది. అయితే  మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పదో తరగతి పరీక్షలకు ఈరోజు వరకు చర్చ జరిగింది. పలు జాగ్రత్తలు తీసుకున్నారు పదవతరగతి పరీక్షలు నిర్వహించాలా లేదా  పూర్తిగా రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేయాల అనే  దానిపై తీవ్రంగా చర్చించింది  రాష్ట్ర ప్రభుత్వం. ఇక చివరికి పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. 

 

 ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన విడుదల చేశారు. అయితే తెలంగాణలో పరీక్షలు రద్దు చేసి... ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఆధారంగా విద్యార్థులందరికీ మార్కులు నిర్ణయించాలి అంటూ  తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే ప్రతిపాదనను వినిపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇంటర్నల్ ఎగ్జామ్స్ ద్వారా విద్యార్థులకు మార్కులు ఇచ్చి పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు అని ఒక వాదన వినిపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 

 


 అసెంబ్లీని రెండు రోజులు నిర్వహించినప్పుడు ఇలాంటి కరోనా  సమయంలో విద్యార్థుల జీవితాలను ప్రమాదంలో పడేస్తూ  పరీక్షలు ఎలా  నిర్వహిస్తారు అంటూ వాదించారు పవన్  కళ్యాణ్ . ఇక ఆ తర్వాత చంద్రబాబు కూడా దీనిపైనే ఇలాంటి  వ్యాఖ్యలు చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు. టీవీ లో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ సర్కారు. ప్రస్తుత పరిస్థితులు ప్రజల ఒత్తిడి దృశ్య ఆంధ్రప్రదేశ్ సర్కారు పరీక్షల రద్దు  నిర్ణయం తీసుకుంది.ఇంటర్  విద్యార్థులను కూడా సప్లమెంటరీ రాయకుండానే ప్రమోషన్స్ చేస్తామని ప్రకటించింది ఏపీ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: