చంద్రబాబు అపరచాణక్యుడు. ఆయన రాజనీతి గొప్పది. చివరి నిముషంలో కూడా ఫలితం మార్చే సత్తా బాబుకు ఉంది అంటారు. అంతే కాదు, సవాళ్ళను సైతం సోఫానాలుగా మార్చుకుని వాటి మీద విజయాల పునాదులు నిర్మిచగల సామర్ధ్యం బాబుకు ఉందని అంటారు. కానీ బాబు కత్తికి పదును తగ్గిపోయిందా ?

 

లేక కాలం కలసిరావడంలేదా, లేదా ఆలోచనలను మించిన ఆవేశంతో వ్యూహాలు గతి తప్పుతున్నాయా. ఏదీ కాకపోతే కచ్చితంగా నాలుగుకు నాలుగు సీట్లు వైసీపీ మంచి మెజారిటీతో గెలుచుకుంటుందని తెలిసి కూడా చంద్రబాబు వర్ల రామయ్యను నిలబెట్టడం ఏంటి,  అది కూడా కచ్చితంగా ఓడిపోతామనుకున్న సీటుని ఆయనకు కేటాయించి బడుగు జనులను అవమానించడం ఏంటి.

 

ఇదంతా బాబు మార్క్ రాజకీయం కాదు అంటున్నారు. ఇక తన పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు కూడా పొందలేక తన పార్టీ ఎంత కుదేల్ అయిందో లోకానికి చాటి చెప్పుకోవడానికా బాబు ఈ రకంగా వ్యవహరించారు అనిపించకమానదు, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఇపుడు మరో విజయాన్ని కోరి మరీ వారిని అందించి పాత గాయానికి తోడుగా సరికొత్త గాయాన్ని బాబు రేపుకున్నట్లు అయింది.

 

ఇపుడు ఈ ఓటమి కోరి తెచ్చుకున్నదే. ఈ ఓటమి తో తమ్ముళ్ళు, పార్టీ కూడా మరింతగా నైతిక స్థైర్యం దెబ్బతినిపోయారు. మరి బాబుకు మరో బాధ ఏంటి అంటే రెబెల్  ఎమ్మెల్యేలు కూడా పార్టీకి ఓటు వేయకపోగా వంశీ  కసితీరా తిట్టేసారు. బాబును, లోకేష్ ని కలిపి మరీ నిందించారు. దీనికోసమా పోటీ పడింది అంటున్నారు తెలుగుదేశంలోని వారే. మొత్తానికి బాబు వ్యూహం పట్టు తప్పింది. సైకిల్ కి మరో పంచర్ బాబే వేశారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా బాబు కోరి మరీ ఓటమిని కౌగిలించుకున్నాడని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: