తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఉందో అక్కడ నమోదవుతున్న కేసులు బట్టి అందరికీ అర్థమవుతోంది. ముఖ్యంగా పరీక్షలు సరిగా చేయడం లేదని కేసిఆర్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. హైకోర్టు మరియు కేంద్ర ప్రభుత్వాలు అనేక సార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఒత్తిడి చేసినా పెద్దగా మొన్నటివరకూ స్పందన రాలేదు. దీంతో రాజకీయ నాయకులకు మరియు డ్యూటీ చేస్తున్న పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ రావటంతో పాటు వైద్యం చేస్తున్న వైద్యులకు కూడా కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్టులు రావడంతో ఇటీవల హైకోర్టు తీవ్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

 

ఈ సందర్భంగా కచ్చితంగా కరోనా వైరస్ పరీక్షలు చేయాలని ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతి వార్డు లో కరోనా వైరస్ పరీక్షలు చేసి వార్డు సంఘాలకు ఫలితాలు చూపించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా కేంద్ర మంత్రి ఒకరు హైదరాబాద్ కి వెళ్ళవద్దు అని సిరియస్ వ్యాఖ్యలు చేశారు. పూర్తి విషయంలోకి వెళితే తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలోనే కరోనా విషయంలో హైదరాబాద్ డేంజర్ జోన్‌లో ఉందని ఆయన అన్నారు.

 

హైదరాబాద్ లో రోజూ కరోనా కేసులు పెరుగుతున్న నేపద్యంలో కిషన్ రెడ్డి గట్టి విమర్శలు చేశారు. 4 లక్షల14 వేల N95 మాస్కులు, 2 లక్షల 31 వేల పీపీఈ కిట్లను కేంద్రం నుంచి తెలంగాణకు పంపించామన్నారు. అయినా కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఆయన ఆరోపించారు. కరోనా టెస్టులు చేయటంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని కిషన్ రెడ్డి ద్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: