కేరళలో కొద్దీ రోజుల నుండి భారీగా కరోనా కేసులు నమోదవుతుండగా  ఈరోజు ఏకంగా రికార్డు స్థాయిలో 127 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని  ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. సింగిల్ డే లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్. ఇందులో 123కేసులు విదేశాల నుండి వచ్చినవారి కాగా  ఈరోజు మరో 57 మంది బాధితులు  కరోనా నుండి కోలుకున్నారు. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం 3039కేసులు నమోదుకాగా అందులో 1450కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 1566మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 21 మంది మరణించారు. 
 మిగితా దక్షిణాది రాష్ట్రాల రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో ఈరోజు 2396 కేసులు నమోదు కాగా ఈఒక్క రోజే కరోనాతో 38మంది మరణించారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 56000కు చేరగా ఇప్పటివరకు 704కరోనా మరణాలు సంభవించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రికార్డు స్థాయిలో 491కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈరోజు 465కేసులు నమోదుకాగా తెలంగాణలో 546కేసులు బయటపడ్డాయి. ఓవరాల్ గా దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 400000 దాటగా 13000కుపైగా మరణాలు చోటుచేసుకున్నాయి.     

మరింత సమాచారం తెలుసుకోండి: