తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొద్దీ కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మొదటిలో సీఎం కేసీఆర్ ఈ విషయంలో చాలా ఈజీగా తీసుకోవటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించడంలో కొంచెం అశ్రద్ధ వహించారు అని చాలామంది అంటున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ భయంకరంగా వ్యాప్తి చెందడం జరిగింది అని చాలామంది భావిస్తున్నారు. పైగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చాలా తక్కువగా జరుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వాలు మరియు న్యాయస్థానాలు విమర్శలు చేయడంతో.. రాష్ట్రంలో డేంజరస్ పొజిషన్ లో కరోనా వైరస్ ప్రభావం ఉందని వైద్యులు చెప్పుకొస్తున్నారు. పోలీసులకు రాజకీయ నాయకులకు అదేవిధంగా కరోనా వైరస్ చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకడం నిజంగా బాధాకరమని మేధావులు అంటున్నారు.

 

ఇటీవల సీఎం కేసీఆర్ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలలో భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని క్యాబినెట్ మీటింగ్ లో డిసైడ్ అయ్యారు. దీంతో ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం పరీక్షలు చేయడానికి రెడీ అయ్యింది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 546 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య   7702కి చేరింది. కరోనాతో ఇవాళ ఐదుగురు మరణించారు. 

 

దీంతో మొత్తం మరణాల సంఖ్య 203కి చేరింది.  నమోదైన మొత్తం కేసుల్లో 3363కేసులు యాక్టివ్ గా ఉంటె, 3506 మంది ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు నమోదైన 546 కరోనా కేసుల్లో జీహెచ్ఎంసి పరిధిలోనే 458 కేసులు ఉన్నాయి.  రంగారెడ్డిలో 50, మేడ్చల్ లో 6, మెహబూబ్ నగర్  3, వరంగల్ అర్బన్  1, వరంగల్ రూరల్ 2, జనగాం 10, ఖమ్మం 2, కరీంనగర్ 13, ఆదిలాబాద్ 1కేసు నమోదైంది. మొత్తంమీద చూసుకుంటే ఉన్న కొద్దీ మహమ్మారి కరోనా వైరస్ తెలంగాణలో ఉధృతంగా మారుతుందని లెక్కల బట్టి అర్థమవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: